ఓటీటీ ఒరిజనల్ మూవీగా ఈటీవీ విన్ తమ ఓటీటీ కోసం నిర్మించిన ‘లిటిల్‌హార్ట్స్’ సినిమాని చూసి నచ్చిన నిర్మాతలు బన్నీవాస్, వంశీ నందిపాటి సినిమా థియేటర్ కంటెంట్ అని భావించి ‘లిటిల్‌హార్ట్స్’ను ముందుగా థియేటర్‌లో రిలీజ్ చేశారు. ’90స్ మిడిల్ క్లాస్’ సినిమాతో అందరికి సుపరిచితుడైన మౌళి తనూజ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ’90స్’ దర్శకుడు ఆదిత్యహాసన్ నిర్మాత. ఎటువంటి ఎక్సపెక్టేషన్స్ లేకుండా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించిస్తూ వీకెండ్ అదరకొట్టింది.
తాజాగా థియేటర్లలో రిలీజ్ అయిన “లిటిల్ హార్ట్స్” , ఘాటి మరియు మాధ్రాసి వంటి భారీ చిత్రాలతో పోటిగా రన్ అయ్యి, ఓపెనింగ్ వీకెండ్‌లోనే బాక్సాఫీస్‌లో దూకుడు చూపింది. యువతను టార్గెట్ చేసిన ఈ ఎంటర్‌టైనర్, మొదటి మూడు రోజుల్లోనే డబుల్ రికవరీ సాధించింది!
మూడు రోజులలో ప్రపంచవ్యాప్తంగా 11 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయడం, ఈ సినిమా మొదటి వీకెండ్‌లోనే పెట్టుబడిని రెండు రెట్లు తిరిగి సాదించింది. ప్రేక్షకుల రెస్పాన్స్,రివ్యూలు, పాజిటివ్ WOM —అన్ని కలిసి సినిమాను Day 3 > Day 2 > Day 1 లో ట్రెండ్ చేయించాయి.
డైరెక్టర్-ప్రొడ్యూసర్ అడిత్య హసన్ , వెబ్ సిరీస్ “90’s—A Middle Class Biopic” ఫేమస్, ప్రొడ్యూసర్‌గా ఈ సినిమాతో మార్కెట్‌లోకి అడుగుపెట్టారు. అదే సిరీస్ స్టార్ మౌలి తో మళ్లీ జట్టు కట్టారు. ఫీమెల్ లీడ్‌గా శివాని నగరం , డైరెక్టర్‌గా సాయి మర్థండ్ … కొత్త జోష్, ఫ్రెష్ స్టోరి …అన్నీ కలిపి లిటిల్ హార్ట్స్ ని ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మార్చాయి.
ఫుల్ రన్‌లో డబుల్ డిజిట్ షేర్ ఖాయం అని మార్కెట్ అంచనాలు. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే— లిటిల్ హార్ట్స్ ఈ హీట్‌ని ఎంతవరకు కొనసాగిస్తుందో చూడాలి!