ఓనం కానుకగా విడుదలైన ‘లోకా: చాప్టర్ 1’ మలయాళ సినిమాకి కొత్త దారులు చూపించింది! దుల్కర్ సల్మాన్ నిర్మాణ సంస్థ వేఫేరర్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన ఈ లేడీ సూపర్‌హీరో మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులు సృష్టిస్తోంది.

కళ్యాణి ప్రియదర్శన్ భారతీయ సినిమా చరిత్రలో తొలి మహిళా సూపర్ హీరోగా సెన్సేషన్ క్రియేట్ చేశారు. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, వారం వారం తగ్గని హైప్‌తో 45 రోజులు గట్టి రన్ ఇచ్చింది.

ఇప్పుడీ సినిమా కలెక్షన్స్ చూస్తేనే షాక్ అవుతారు

కేరళలో: ₹120.30 కోట్లు

భారతదేశం మిగతా ప్రాంతాల్లో: ₹60.10 కోట్లు

ఓవర్సీస్: ₹119.62 కోట్లు (సుమారు $13.48 మిలియన్)

మొత్తం 45 రోజులకు వరల్డ్‌వైడ్ గ్రాస్ ₹300.02 కోట్లు!
ఇదే కాకుండా, థియేట్రికల్ రన్ పూర్తయ్యే సరికి ₹305 కోట్ల దాకా చేరే అవకాశం ఉంది.

ఇది మలయాళ సినిమా చరిత్రలో తొలి ₹300 కోట్లు దాటిన చిత్రం!

సినిమాలో నస్లెన్, మమ్ముట్టి, టోవినో థామస్, సన్నీ వెయిన్, సాండీ మాస్టర్ వంటి నటుల ప్రదర్శనలు కూడా మేజర్ హైలైట్‌గా నిలిచాయి. జేక్ బిజోయ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం థియేటర్లను షేక్ చేసింది.

‘లోకా’ – లేడీ సూపర్ హీరో లెజెండ్ బిగిన్స్!
మలయాళ ఇండస్ట్రీకి కొత్త గర్వకారణం… ఇక చాప్టర్ 2 కోసం వేచి చూడాలి!

, , , ,
You may also like
Latest Posts from