సౌత్ లేడీ సూపర్‌స్టార్ నయనతార చుట్టూ మరోసారి వివాదం చెలరేగింది. ఆమె జీవితాన్ని ఆవిష్కరించిన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ “నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్” ఇప్పుడు కోర్టు దాకా వెళ్లింది.
నిర్మాతల ఆరోపణల ప్రకారం – ‘చంద్రముఖి’ మూవీ క్లిప్స్, ‘నాన్ రౌడీ ధాన్’ షూటింగ్ వెనుక ఫుటేజ్‌ను అనుమతి లేకుండా వాడారని చెబుతున్నారు. ఇది కాపీరైట్ ఉల్లంఘన అని వారు స్పష్టంచేశారు.
అందుకే ఏపీ ఇంటర్నేషనల్ (చంద్రముఖి ప్రొడ్యూసర్), అలాగే ధనుష్ ప్రొడక్షన్ హౌస్ (నాన్ రౌడీ ధాన్ నిర్మాత) మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
బుధవారం విచారణలో, కోర్టు నయనతారతో పాటు నెట్‌ఫ్లిక్స్‌కూ నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 6వ తేదీ లోగా తమ వివరణ సమర్పించాలని ఆదేశించింది.
అసలు ఎక్కడ మొదలైంది
నయన్ జీవితాన్ని ఆధారం చేసుకొని, ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ తీసుకొచ్చిన డాక్యుమెంటరీ సిరీస్ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’. (Nayanthara: Beyond the Fairytale) ఈ డాక్యుమెంటరీ కోసం నయన్ – విఘ్నేశ్ కలిసి వర్క్ చేసిన తొలి చిత్రం ‘నానుమ్ రౌడీ దాన్’ (తెలుగులో నేనూ రౌడీనే)లోని సన్నివేశాలను చూపించాలనుకున్నారు. కాకపోతే చిత్ర నిర్మాత అయిన ధనుష్ దానికి అంగీకరించకపోవడంతో నయన్ సోషల్‌మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు.
డాక్యుమెంటరీలో ఏముంది
అటు వ్యక్తిగత జీవితం.. ఇటు సినిమాల్లో విమర్శలతో అవకాశాలు కోల్పోయిన నయన్ తిరిగి ఎలా ట్రాక్‌లోకి వచ్చారన్న సంగతులు ఆసక్తిగా తెలియజేశారు. అవకాశాలు తగ్గిన సమయంలో నాగార్జున (Nagarjuna) ఫోన్ చేసి ‘బాస్’ కోసం అడగటం, రిలేషన్‌షిప్ దెబ్బతిని బాధపడుతున్న సమయంలో ‘శ్రీరామరాజ్యం’లో అవకాశం రావడం అందరూ ఆ చిత్ర బృందం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వార్తలు రాసినప్పుడు నయన్ పడిన మానసిక క్షోభ తదితర వివరాలను కూడా ఆయా నటీనటులు, నిర్మాతలతో చెప్పించారు.
మరీ ముఖ్యంగా ‘సీత’ పాత్ర చేసినన్ని రోజులు నయన్ ఎంతో నిష్ఠగా ఉండేదని చెప్పారు. అక్కడి నుంచి ‘లేడీ సూపర్‌స్టార్’ ఎలా అయ్యారో.. ఆమె పేరుతో సినిమాలు ఎన్నెన్ని కోట్లు మార్కెటింగ్ చేస్తాయో వంటి విషయాలను ప్రస్తావించారు.
ఇప్పుడు మీడియాలో నలుగుతున్న ప్రశ్నలు :
ఈ లీగల్ ఫైట్‌లో నయనతార-నెట్‌ఫ్లిక్స్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారు? డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఏంటి?