మంచు విష్ణు కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటూ వచ్చిన చిత్రం ‘కన్నప్ప’ . ఈ చిత్రాన్ని ఏకంగా రూ.200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు మంచు విష్ణు. ఈ భారీ ప్రాజెక్ట్ జూన్ 27న థియేటర్లలోకి వచ్చింది. ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ కీలక పాత్రలో ఉండటంతో సినిమా కు ఓపెనింగ్స్ డీసెంట్‌గా వచ్చాయి. . వీక్ డేస్ లో కూడా డీసెంట్ అనిపించింది.
అలాగే ఈ వారం ‘తమ్ముడు’, ‘3BHK’ లాంటి కొత్త సినిమాలు రిలీజైనా… ‘కన్నప్ప’ కు పెద్దగా దెబ్బ తగలలేదు. మొదటి వీక్ డేస్ లోనూ మంచి హోల్డ్ చూపించింది. రెండో వీకెండ్ కూడా ఓకే అనిపించింది. అయితే సినిమా టార్గెట్ దిశగా వెళ్లడం మాత్రం కనిపించడం లేదు.
▶ 10 రోజుల కలెక్షన్లపై ఓ లుక్:
ప్రాంతం షేర్ (రూ. కోట్లు)
నైజాం 7.19
సీడెడ్ 2.41
ఉత్తరాంధ్ర 2.28
ఈస్ట్ 1.21
వెస్ట్ 0.88
గుంటూరు 0.99
కృష్ణా 0.90
నెల్లూరు 0.79
AP+TG టోటల్ 16.65
రెస్ట్ ఆఫ్ ఇండియా 4.50
ఓవర్సీస్ 2.59
వరల్డ్ వైడ్ షేర్ 23.68 కోట్లు
వరల్డ్ వైడ్ గ్రాస్ 42.5 కోట్లు
బ్రేక్ ఈవెన్ ఎంత?
‘కన్నప్ప’ థియేట్రికల్ బిజినెస్: ₹86 కోట్లు
బ్రేక్ ఈవెన్ టార్గెట్ (షేర్): ₹87 కోట్లు
ఇప్పటివరకు వచ్చిన షేర్: ₹23.68 కోట్లు
ఇంకా రాబట్టాల్సిన షేర్: ₹63.32 కోట్లు