మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa).2025 ఏడాది మొదలైన నుంచి ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. అలరిస్తూనే ఉన్నాయి. అందులో భాగంగా నేడు (మార్చి 1న) కన్నప్ప సెకండ్ టీజర్ గ్రాండ్గా రిలీజయింది. కన్నప్ప ఫస్ట్ టీజర్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప’ పేరుతో రిలీజ్ చేశారు.
బాలీవుడ్ డైరెక్టర్ ముకేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న కన్నప్ప లేటెస్ట్ టీజర్ ఆసక్తికరంగా సాగింది. విష్ణు నటన, టీజర్ విజువల్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. తిన్నడు పాత్రలో మంచు విష్ణు కనిపించాడు. తన వారి కోసం ఎంతటి వారినైనా ఎదిరించే వాడిగా విష్ణు ఆకట్టుకున్నాడు.
మోహన్‌బాబు నిర్మాత. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా సిద్ధమవుతోన్న ఈచిత్రం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈనేపథ్యంలోనే చిత్రబృందం తాజాగా టీజర్ 2 (Kannappa Teaser2) విడుదల చేసింది. తిన్నడు పాత్రలో విష్ణు నటన ఆకట్టుకునేలా ఉంది. శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతీ దేవిగా కాజల్ కనిపించారు. టీజర్ చివర్లో రుద్రగా ప్రభాస్ కనిపించి అలరించారు.
https://youtu.be/wKBP9dFxFBc?si=crDHuhaIABI5zHhX
‘ఆపద వచ్చిన ప్రతిసారి వీరుల తలలు కోరుకునే ఈ రాయి దేవత కాదు’ అనే విష్ణు డైలాగ్ పవర్ ఫుల్ గా ఉంది. అంతటి నాస్తికుడు మీకు భక్తుడవుతాడా? అని శివుడి భార్యగా పార్వతి పాత్రలో నటించిన కాజల్ చెప్పే డైలాగ్ సైతం ఆసక్తిగా ఉంది.
ఈ టీజర్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే భక్తి, త్యాగం మరియు గొప్పతనం యొక్క చారిత్రక కథనాన్ని చెప్పే దిశగా సాగిం.