ఈ వార్త సినిమా వర్గాల్లో పెద్ద సంచలనంగా మారేలా కనపడుతోంది. హింస ఎక్కువ ఉందని టీవిల్లో, ఓటిటిల్లో స్ట్రీమింగ్ చెయ్యద్దని ఓ సూపర్ హిట్ సినిమాపై బ్యాన్ పెట్టడం ఇదే మొదటిసారి. ఆ సినిమా మరేదో కాదు వంద కోట్లు ఏకబిగిన తెచ్చుకుని సూపర్ హిట్ గా నిలిచిన మార్కో (Marco).ఓటిటిల్లో కూడా బాగానే వర్కవుట్ అయ్యింది. అయితే ఇప్పుడు ఇంతకాలానికి ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) కేంద్రానికి లేఖ రాసిన‌ట్లు తెలుస్తుంది.

మలయాళీ నటుడు ఉన్ని ముకుందన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌ మార్కో (Marco). హనీఫ్ అదేని (Haneef Adeni) ఈ సినిమాకు దర్శకత్వం వ‌హించ‌గా.. యాక్ష‌న్ జాన‌ర్‌లో ఈ సినిమా వ‌చ్చింది. డిసెంబ‌ర్ 20న మ‌ల‌యాళంలో విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తెచ్చుకోవ‌డ‌మే కాకుండా.. బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు రూ.100 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

సినిమాలో మితిమీరిన వ‌యోలెన్స్ ఉన్న కూడా ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుంది ఈ చిత్రం. అయితే ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ సెన్సార్ బోర్డు కేంద్రానికి లేఖ రాసింది. కొన్ని సన్నివేశాలలో రక్తపాతం ఎక్కువగా ఉందని అందుకే టెలివిజన్ లో ప్రసారం చెయ్యద్దని ఆదేశాలు జారే చేసింది.

ఈ క్రమంలో శాటిలైట్ హక్కులని టీవీ ఛానెల్స్ కి అమ్మెందుకు రిక్వెస్ట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‍సీ) కి రిక్వెస్ట్ చెయ్యగా తిరస్కరించింది. దీంతో మార్కో సినిమా ప్రసారం టెలివిజన్ ఛానెల్స్ లో లేనట్లేనని తెలుస్తోంది.

అలాగే ఈ సినిమాను ఓటీటీ (Marco OTT Ban)లో నుంచి బ్యాన్ చేయాలంటూ కేంద్ర ప్ర‌భుత్వాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కోరింది. ఈ చిత్రాన్ని మ‌రి దారుణంగా తెర‌కెక్కించ‌డంతో పాటు చిన్న పిల్ల‌ల‌ను క్రూరంగా చంప‌డం, గ‌ర్భిణి యువ‌తిని.. కళ్లు లేని యువకుడిని చంపే స‌న్నివేశాలు దారుణంగా ఉన్న‌యంటూ సెన్సార్ బోర్డ్ తెలిపింది.

అయితే ప్రస్తుతం మార్కో సినిమా ప్రముఖ ఓటీటీలైన సోనీలివ్, ఆహా లో అందుబాటులో ఉంది. ఇందులో మార్కో మలయాళ వెర్షన్ సోనీలివ్ లో అందుబాటులో ఉండగా, తెలుగు వెర్షన్ ఆహాలో చూడవచ్చు.

, , ,
You may also like
Latest Posts from