ఒకప్పుడు “మాస్ మహారాజా” అనగానే థియేటర్లు హౌస్‌ఫుల్‌గా మారేవి. రవితేజ సినిమాలకు కలెక్షన్లు కొల్లగొట్టేవి. కానీ వరుస ఫెయిల్యూర్లతో భాక్సాఫీస్ దగ్గర రవితేజ నడక నత్తనడక గా మారింది. తక్కువ సమయంలో ఎక్కువ హిట్లు కొట్టిన హీరోగా పేరున్న రవితేజ, ఇప్పుడు మార్కెట్ పరంగా వెనకబడిపోయాడు. ముఖ్యంగా గత 2–3 ఏళ్లుగా థియేట్రికల్‌తో పాటు నాన్-థియేట్రికల్ మార్కెట్‌లోనూ ఆయన క్రేజ్ బాగా డౌన్ అయింది.

వరుస నష్టాలు..నో డీల్స్‌

రవితేజ సెలక్షన్లపై ఇప్పటికే పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుండడంతో, నిర్మాతలు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నారు. అయినా రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం ఆయన తగ్గడంలేదు. ఫలితంగా ఆయన సినిమాలకు రేట్లు పడిపోతున్నాయి. ఇప్పుడు కొత్త సినిమాలకి ఓటీటీ, శాటిలైట్ డీల్స్‌కే ప్రాపర్ డిమాండ్ లేకుండా పోయింది.

‘మాస్ జాతర’ డీల్ మాత్రం రిలేషన్ బేస్డ్

ఆగస్టు 27న రిలీజ్ కాబోతున్న మాస్ జాతర డిజిటల్ రైట్స్‌ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే ఇది కథ చూసి చేసిన డీల్ కాదు. చిత్రాన్ని నిర్మిస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్‌తో ఉన్న సంబంధాల వల్లే ఈ డీల్ కుదిరినట్లు టాక్. ఇక రవితేజ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తున్న సినిమాకైతే ఇప్పటి వరకూ ఏ నాన్-థియేట్రికల్ డీల్‌ కూడా ఫైనల్ కాలేదని సమాచారం.

హిందీ మార్కెట్ కూడా డౌన్

ఒక సమయంలో హిందీలో డబ్బింగ్ సినిమాల ద్వారా మంచి మార్కెట్ తెచ్చుకున్న రవితేజకు ఇప్పుడు అక్కడ కూడా ఆసక్తి చూపడం లేదు. కంటెంట్ బలంగా ఉంటేనే చూస్తామని వారు స్పష్టంగా చెబుతున్నారు. మొత్తానికి, మాస్ మహారాజా మన్నింపు పొందాలంటే మరో సారి సాలిడ్ బ్లాక్‌బస్టర్ తప్పదు. అప్పటివరకు… మార్కెట్ తిరిగి ఎక్కడం కష్టమే!

, , ,
You may also like
Latest Posts from