ఇండియన్ సినిమా ఓ పాన్-ఇండియా ఫినామెనన్‌గా మారిపోతున్న నేపథ్యంలో, భాషా పరిమితులు లేకుండా బ్లాక్‌బస్టర్ చిత్రాలు అందించడం చాలా అరుదైన విషయం. అలాంటి అరుదైన విజయాన్ని సాధించిన ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్. ఒకే సమయంలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో మూడు మేజర్ విజయాలు అందించిన మైత్రీ, ఇప్పుడు టాలీవుడ్ గర్వించాల్సిన బ్రాండ్‌గా ఎదిగింది.

📍 తెలుగులో – పుష్ప 2: ది రూల్

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి సుకుమార్ డైరెక్షన్‌లో రూపొందిన “పుష్ప 2” ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ అయ్యింది. “తగ్గేదే లే!” అన్న డైలాగ్‌తో మొదటి భాగం పాన్-ఇండియా విజయాన్ని సాధించగా, రెండో భాగం అయితే రికార్డులను తిరగరాసింది. ఈ సినిమా వాణిజ్యంగా మాత్రమే కాక, కల్చరల్ సెన్సేషన్‌గా మారింది.

📍 తమిళంలో – గుడ్ బ్యాడ్ అగ్లీ

కొలీవుడ్ స్టార్ అజిత్ తో కలిసి మైత్రీ వారు నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్, తమిళ నాట బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. మాస్, క్లాస్ ఆడియన్స్‌కి ఒకేసారి కనెక్ట్ అయ్యేలా కథనం, విజువల్స్, మ్యూజిక్ అన్నీ మేజిక్ చేసాయి. ఇది మైత్రీ తమిళ మార్కెట్‌లో మొదట అడుగే అయినా దుమ్ము దులిపింది.

📍 హిందీలో – జాట్

బాలీవుడ్‌లో మైత్రీ వారు వేసిన అడుగు “జాట్” సినిమాతో మరింత బలంగా మారింది. ఒక సామాన్య యువకుడి స్టోరీ గా మొదలెట్టి అసాదారణమైన మలుపులతో మాస్ ఎలిమెంట్స్ తో జాట్ క్యారెక్టర్‌ను నేషనల్ లెవెల్‌కి తీసుకెళ్లారు. హిందీ మాస్ ప్రేక్షకులే కాదు, హార్ట్‌టచింగ్ ఎమోషన్స్‌తో క్రిటిక్స్‌ను కూడా మెప్పించారు.

మల్టీ-లింగ్వల్ స్కేలింగ్‌కు మైత్రీ అద్దం

వేరే భాషల్లో సినిమాలు తీయడం ఒక ఎక్స్‌పెరిమెంట్ అయి ఉండొచ్చు కానీ మైత్రీ మూవీ మేకర్స్‌కి అది ఎక్స్‌పర్టైజ్‌గా మారింది. ప్రతి భాషా మార్కెట్‌ను బాగా అర్థం చేసుకుని, స్టార్స్ ఎంపిక, కథా విన్యాసం, మార్కెటింగ్ మొదలైన వాటిలో ప్రెసిషన్ చూపించడమే వీరి సక్సెస్ సీక్రెట్.

ఎక్కడ చూసినా మైత్రీ పేరు వినిపిస్తోంది!

పాన్ ఇండియా ట్రెండ్‌లో మైత్రీ మూవీ మేకర్స్ వేసిన ముద్ర ఇంకా దృఢంగా ఉంది. ఫ్యూచర్‌లో వీరి నుంచి మరిన్ని భాషలలో, మరిన్ని మైలురాళ్ల సినిమాలు రావడం ఖాయం అనిపిస్తోంది.

, , ,
You may also like
Latest Posts from