చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అప్పట్లో గాడ్జిల్లా టైటిల్ తో వచ్చిన ఓ సినిమా థియేటర్స్ లో రచ్చ రచ్చ చేయటం. ఇప్పుడు ఆ ఇన్సిప్రేషన్ తోనే అనుకుంటా..నాగ్జిల్లా టైటిల్ తో ఓ సినిమా రూపొందిస్తున్నారు ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్.
మనిషి పెద్ద పాముగా మారి కన్నెత్తి చూడలేనంత ఎత్తులో అరాచకం చేస్తుంది ఈ నాగ్జిల్లా సినిమాలో అంటున్నారు. పాము వర్సెస్ మానవ సంఘర్షణ చుట్టూ తిరిగే ఒక కామెడీ సినిమాని ప్లాన్ చేస్తోంది ధర్మా ప్రొడక్షన్స్.
కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది 2026 ఆగస్ట్ 14 విడుదల చేస్తామని అఫీషియల్ గా చెప్పేశారు.భారీ యాక్షన్ మసాలా అంశాలతో ఈ నాడ్జిల్లా సినిమా ఉంటుందని, ఇది సక్సెస్ అయ్యాక లఈ సిరీస్ లో ఎన్నో సినిమాలు వస్తాయని చెప్తున్నారు.
ఈ చిత్రం సెప్టెంబర్ 2025లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 2026 ద్వితీయార్థంలో విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ చిత్రం హాస్యం, పూర్తి వినోదంతో నిండి ఉంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.