ప్రముఖ దర్శకుడు, నేషనల్ అవార్డ్ విన్నర్ నాగ్ అశ్విన్ గత సంవత్సరం కల్కి 2898 ADని అందించాడు. ఈ చిత్రానికి సీక్వెల్‌ను రెడీ చెయ్యాలి.షూటింగ్ కు ప్లాన్ చేశాడు. కానీ ప్రభాస్ బిజీగా మారిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి.
ప్రభాస్ డేట్స్ దొరికేలా లేవు. దాంతో కల్కి 2898 AD సీక్వెల్ వచ్చే ఏడాదికి వెళ్లింది. కల్కి 2898 AD యొక్క సీక్వెల్ తీయడానికి ముందు ప్రభాస్… రాజా సాబ్, ఫౌజీ మరియు స్పిరిట్ షూట్‌లను పూర్తి చేస్తాడు.మరి ఇంతకాలం ఖాళీగా ఉండటం ఎందుకు…
ఆలోపు నాగ్ అశ్విన్ బాలీవుడ్ హీరోయిన్ తో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ క్వీన్ అలియా భట్ తో కథకు సంబంధించిన చర్చ చేసినట్లు ముంబై రిపోర్ట్. ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ కావడంతో ఆమెనే మొదటి ఛాయస్‌గా పెట్టుకున్నాడట.
అంతేకాదు అలియాకు స్టోరీ లైన్ చెప్పాడని.. ఆమె ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. కల్కి సీక్వెల్ మూవీ ప్రారంభం కావడానికి సమయం పడుతుండటంతో నాగ్ అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నాడట.
కానీ అలియాకు డేట్ల సమస్య ఉంది. ప్రజంట్ ఈ అమ్మడు ‘అల్ఫా’, ‘లవ్ అండ్ వార్’, ‘చాముండా’ వంటి చేతినిండా నిండా సినిమాలతో బిజీగా ఉంది. కనుక ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చెంత వరకు వేచి చూడాలి.