హీరోలు ఇప్పుడు విభిన్నమైన పాత్రలు చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. తమలోని నటుడుని బయిటకు తీయటానికి ట్రాన్సజెండర్ వంటి పాత్రలు చేయటానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా నాని కూడా అలాంటి ప్రయోగమే చెయ్యబోతున్నారని తెలుస్తోంది.

‘ది ప్యారడైజ్’ సినిమాలో నాని ట్రాన్స్ జెండర్ రోల్ చేస్తున్నారని ఫిలిం నగర్ వర్గాలలో వినపడుతోంది. అయితే అది కేవలం స్పెక్యులేషనా నిజమా అనేది తెలియదు. సినిమా నుంచి విడుదల అయిన ఆయన ఫస్ట్ లుక్ చూసి ఇలాంటి వార్తలు పుట్టించారా?

ఫస్ట్ లుక్ లో రెండు జడలు వేసుకుని ఒళ్ళంతా పచ్చబొట్టులతో కనిపించాడు. చేతిపైన “ల..కొడుకు” అని కూడా టాట్టూ వేయించుకున్నాడు. అటువంటి లుక్కులో నాని కనిపించడం వెనుక రీజన్ ఏమిటి అని కొందరు ఆలోచించి ఇలాంటి ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.

ఎందుకంటే లుక్ రిలీజ్ చేయడం తప్ప సినిమాకు సంబంధించి ఎటువంటి మ్యాటర్ కూడా రివీల్ చేయలేదు దర్శకుడు.

‘ది ప్యారడైజ్’లో నాని రెండు జడలతో కనిపించడం వెనక కారణం ట్రాన్స్ జెండర్ రోల్ అని చెప్పుకుంటున్నారు. ఒక అబ్బాయి ఎందుకు ట్రాన్స్ జెండర్ అయ్యాడు? అనేది సినిమాలో ఆసక్తికరమైన అంశం చెప్తన్నారు. ట్రాన్స్ జెండర్ అయ్యాక ఏం చేశారనేది కూడా క్రేజీగా ఉంటుందని వినబడుతోంది.

ఇటీవల “శ్రీ విష్ణు” ట్రాన్స్ జెండర్ లా “స్వాగ్” అనే సినిమాలో కనిపించాడు.

, ,
You may also like
Latest Posts from