టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ..పవన్ కళ్యాణ్ కు వీరభక్తుడు అనే సంగతి తెలిసిందే. ఈ విషయం చాలా సార్లు బహిరంగంగానే చెప్పారు. తన సినిమాల్లో రిఫరెన్స్ లు కూడా ఇస్తూంటారు. అందుకు తగ్గ ప్రయారిటీని పవన్ అభిమానుల నుంచి ఆయన పొందుతూంటూరు. అయితే ఇప్పుడు పవన్ సినిమాకే ఎదురు వెళ్తున్నారు నితిన్. కావాలనే వెళ్తున్నారా లేక పవన్ పోటీ లో లేరు అని ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా , అసలేం జరిగింది.
హీరో నితిన్ నటిస్తున్న మూవీ రాబిన్ హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీలీల కథానాయిక నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచలి రవిశంకర్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ఫిక్సైంది. ఈ ఏడాది మార్చి 28న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఓ పోస్టర్ ద్వారా చిత్ర టీమ్ తెలియజేసింది.
వాస్తవానికి ఈ చిత్రం గత ఏడాది క్రిస్మస్ సందర్బంగా విడుదల కావాల్సి ఉంది. కాగా.. కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ చేస్తున్నట్లు అప్పట్లో చిత్ర బృందం తెలిపింది. తాజాగా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించింది.
అయితే.. మార్చి 28న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ కానుంది.
దాంతో పవన్ కళ్యాణ్ కి భక్తుడిని అని నితిన్ చెప్పుకుంటారు. అంతగా పవన్ ని అడ్మైర్ చేసే నితిన్ .. పవన్ కళ్యాణ్‌తో పోటీపడడానికి సిద్ధపడటం ఏమిటని సోషల్ మీడియాలో పవన్ అభిమానులు నిల దీస్తున్నారు.
నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘రాబిన్ హుడ్’. ‘భీష్మ’ లాంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత వీరి కాంబోలో వస్తున్న మూవీ కావడంతో ‘రాబిన్ హుడ్’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.