ఎన్టీఆర్ నుంచి అరవింద సమేత తర్వాత వచ్చిన సోలో సినిమా దేవర. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్లో రికార్డు గ్రాసర్ గా నిలిచింది. బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ భారీ సినిమాని మేకర్స్ రీసెంట్ గానే జపాన్ దేశంలో రిలీజ్ కి తీసుకొచ్చారు. అక్కడ ప్రమోషన్స్ భారీగా చేసారు. ఈ నేపధ్యంలో దేవర పార్ట్ 2 పై జపాన్ లో ఎన్టీఆర్ ఇచ్చిన అప్డేట్ వైరల్ గా మారింది. సెకండ్ పార్ట్ కచ్చితంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ… ”ఒక పెద్ద కథలో ఇప్పటికి సగం మాత్రమే చెప్పాం. రెండో భాగం చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది. పార్ట్-1లో మీరు దేవర గురించి తెలుసుకున్నారు. పార్ట్-2లో వర పాత్ర గురించి తెలుసుకుంటారు. అసలు దేవరకి ఏమైంది అనే ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది” అని ఎన్టీఆర్ తెలిపారు.

రెండు భాగాలుగా ప్లాన్ చేసిన దేవర మూవీ ఫస్ట్ పార్ట్, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో రిలీజయింది. భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ చిత్రం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఓవర్గం ఆడియన్స్ నుంచి మాత్రం మిక్స్డ్ టాక్ వచ్చింది.

అయినప్పటికీ టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ సాధించింది. దీంతో సెకండ్ పార్ట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ‘దేవర 2’పై తారక్ క్రేజీ న్యూస్ పంచుకుని అభిమానులకు ఆనందం కలగచేసారు.

, , ,
You may also like
Latest Posts from