పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా OG (They Call Him OG) పైన అభిమానులలో ఉత్సాహం పీక్‌కి చేరుకుంది.. ఈ చిత్రం సెప్టెంబర్ 25న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది .

OG సినిమా పేడ్ ప్రీమియర్స్ ఆంధ్ర, తెలంగాణలో సైమల్టేనియస్‌గా ఉంటాయన్న వార్తతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం షో టైమింగ్స్‌పై గందరగోళం మొదలైంది.

ఇటీవలి పెద్ద సినిమాలు హరి హర వీర మల్లు, పుష్పా 2 రెండూ రెండు రాష్ట్రాల్లో ఒకేసారి ప్రీమియర్స్ వేశాయి. కానీ ఆశ్చర్యకరంగా OGకి మాత్రం టైమింగ్స్ డిఫరెంట్‌గా పెట్టారు.

తెలంగాణలో సెప్టెంబర్ 24వ తేదీ రాత్రి 9 గంటల నుంచే స్పెషల్ షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం సెప్టెంబర్ 25న తెల్లవారు జామున 1 గంట నుంచే షోలు స్టార్ట్ కావాలి.

దీంతో థియేటర్ యజమానులు, ఆడియన్స్‌కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పటికే కొన్ని థియేటర్లు 1 AM షోలకే బుకింగ్స్ ఓపెన్ చేశాయి. కానీ గవర్నమెంట్ ఆర్డర్ మారితే రీ-షెడ్యూల్ తప్పదు.

ప్రేక్షకులు కూడా గందరగోళంలోనే ఉన్నారు. చాలామందికి “డెఫినెట్‌గా 24న రాత్రే ప్రీమియర్స్ జరుగుతాయి” అన్న నమ్మకం ఉండటంతో టికెట్స్ బుక్ చేయాలా వద్దా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు.

ఈ క్లారిటీని ఇవ్వాల్సింది OG మేకర్స్‌నే అని ఇండస్ట్రీ టాక్. త్వరగా ఒక అధికారిక ప్రకటన ఇవ్వకపోతే ఆంధ్రలో ఈ గందరగోళం మరింత పెరిగే ఛాన్సుంది.

ఇక ఇటీవల OG నుండి వచ్చిన ‘వాషి యో వాషి’ వీడియో కాన్టెంట్‌తో అభిమానుల్లో ఎక్సైట్మెంట్ మరింత పెరిగింది. ఈ పాటలో పవన్ కళ్యాణ్ జపనీస్ పోయెమ్ పాడటం విశేషం. OG సినిమాను దర్శకుడు సుజీత్ ఎంతో స్టైలిష్‌గా తెరకెక్కిస్తున్నారని ట్రైలర్స్, టీజర్స్ చూస్తే స్పష్టంగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా పైన శ్రద్ధ పెట్టారు.

ఈ మూవీకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ సెప్టెంబర్ 21 ఉదయం 10:08కి విడుదల కానుంది. ఇప్పటికే పాటలు, టీజర్‌లకు మంచి స్పందన రావడంతో ట్రైలర్ పైన కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ OG సినిమా ఫస్ట్ హాఫ్‌ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారాణి ఇటీవల తమన్ ఓ ప్రోగ్రామ్ లో తెలిపారు. అయితే OG ట్రైలర్ విడుదలకి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

, , , , , ,
You may also like
Latest Posts from