పవన్ కళ్యాణ్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘ఓజీ’ ఓవర్సీస్‌లో ఊహించని సమస్యను ఎదుర్కొంటోంది. కంటెంట్ డెలివరీలో ఆలస్యం కారణంగా ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లు అసహనం వ్యక్తం చేస్తుండగా, తాజాగా సౌత్ ఆఫ్రికాలోని ప్రీమియర్ షోలు రద్దు అయ్యాయి.

కేప్‌టౌన్, డర్బన్‌లో జరగాల్సిన రెండు ప్రీమియర్ షోలు ముందుగానే సోల్డ్ అవుట్ అయ్యాయి. అయితే కంటెంట్ టైమ్‌కు అందకపోవడంతో ఆ షోలు రద్దయినట్లు సమాచారం.

ఓవర్సీస్ మార్కెట్లో ‘ఓజీ’కు భారీ డిమాండ్ ఉంది. ఇప్పటికే $3 మిలియన్ (₹25 కోట్లు పైగా) అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్ సృష్టించాయి. కానీ కంటెంట్ ఆలస్యంగా డిస్పాచ్ కావడం వల్ల కొన్ని చోట్ల ప్రారంభ షోలు రద్దవ్వడం డిస్ట్రిబ్యూటర్లలో టెన్షన్ క్రియేట్ చేస్తోంది.

ఓవర్సీస్‌లో సేల్ రికార్డులు కొడుతున్న ‘ఓజీ’… కానీ కంటెంట్ డిలే కారణంగా ఫ్యాన్స్ టెన్షన్!

, , , ,
You may also like
Latest Posts from