
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ ఎట్టకేలకు విడుదలైంది. ఎన్నో అంచనాలతో సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఓజీ సినిమాకు అభిమానుల నుంచి ఫుల్ పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఓజీ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి.
మరో ప్రక్క “ఓజీ” సినిమాపై టికెట్ రేట్ల పెంపు అంశం చుట్టూ పెద్ద హంగామా రేపిన విషయం తెలిసిందే. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చి, టికెట్ రేట్ల పెంపు GOని అక్టోబర్ 9 వరకు సస్పెండ్ చేసింది.
కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ వచ్చింది! టికెట్ రేట్లపై కోర్టులో కేసు వేసిన పిటిషనర్ కోసం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఆయన సినిమా నైజాం ఏరియాలో ఎక్కడ చూసినా ₹100 డిస్కౌంట్ ఇస్తామని హైకోర్టు సూచన మేరకు డివివి ఎంటర్టైన్మెంట్స్ అఫీషియల్‌గా ట్వీట్ చేసింది.
ఈ నిర్ణయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు పిటిషనర్ కష్టపడి వేసిన కేసు ఫలితంగా స్పెషల్ బెనిఫిట్ దక్కగా, మరోవైపు “ఓజీ” మాత్రం ఫస్ట్ డే 154 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డులు సృష్టించింది.
ఇక పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా పైగా డివివి దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించడం సినిమాకి మరింత హైప్ తెచ్చిపెట్టింది.
