పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరో గా రూపొందుతున్న ‘ఓజీ’ (They Call Him OG) మీద అంచనాలు భారీ‌ స్థాయిలో ఉన్నాయి. సినిమా నుంచి చిన్న గ్లింప్స్, సాంగ్, ఆఖరికి పోస్టర్ వచ్చిన సరే ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ ఒక రేంజ్‌లో ఉంటోంది. ఇదే వివాదాలను సైతం తెచ్చిపెడుతోంది.

తాజాగా “OG”పై నార్త్ అమెరికా ఫ్యాన్స్ క్రేజ్ పీక్స్‌కి చేరింది. సినిమా ప్రీమియర్ షోస్‌కు ఇంకా 20 రోజులు ఉన్నప్పటికీ, అడ్వాన్స్ టికెట్ సేల్స్ ఇప్పటికే $1 మిలియ‌న్ దాటేసింది.

కానీ… ఇక్కడే ట్విస్ట్ ఉంది!
ఇటీవల బుకింగ్స్ స్లోగా మారడంతో, ఫ్యాన్స్‌లో టెన్షన్ మొదలైంది. “OG” ప్రీమియర్ షోస్‌లో $2 మిలియ‌న్ మార్క్ దాటుతుందా? అనే సందేహం మొదలైంది. ఎందుకంటే…

ప్రభాస్ “Kalki 2898 AD” – $3.8 మిలియ‌న్ ప్రీమియర్ షోస్ కలెక్షన్
“Coolie” & “Pushpa 2” – $3 మిలియ‌న్+

ఇలాంటి బిగ్ బెంచ్‌మార్క్‌లతో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా “OG”ను టాప్‌లో చూడాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కానీ, USAలో స్క్రీన్స్ & లొకేషన్లు తక్కువగా ఓపెన్ చేయడంతో ఫ్యాన్స్ ఆగ్రహం ఆకాశాన్నంటింది.

Distributor పై ఫ్యాన్స్ ఫైర్!

సోషల్ మీడియాలో “Prathyangira Cinemas”పై నెట్టింట దుమారం మొదలైంది. “అంత క్రేజ్ ఉన్నా స్క్రీన్స్ ఎందుకు తక్కువగా పెట్టారు?” అంటూ ఫ్యాన్స్ హడావిడి చేస్తున్నారు.

Distributor స్పందన:
ఈ వివాదంపై Prathyangira Cinemas అధికారిక స్టేట్మెంట్ ఇస్తూ –

“మేము లొకేషన్లు, స్క్రీన్స్ పరిమితంగా ప్లాన్ చేశాం. కానీ ఇది పూర్తిగా ఫ్యాన్స్‌కి సేఫ్ & స్మూత్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వడానికే. ఇంకా రోజులు ఉన్నాయి, డిమాండ్‌ను బట్టి స్క్రీన్స్ పెంచుతాం” అని స్పష్టం చేశారు.

పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించిన ‘ఓజీ’ సినిమాలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్. ఇతర కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ‘సాహో’ తర్వాత సుజిత్ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. మాఫియా నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు.

, , , , ,
You may also like
Latest Posts from