
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్యాన్ వార్స్ భగ్గుమంటున్నాయి. సోషల్ మీడియాలో హీరోల అభిమానులు ఒకరిపై ఒకరు విరుచుకుపడుతుండగా, ఈసారి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేరుగా స్పందించారు.
“ఇలాగే రచ్చ కొనసాగితే సినిమానే చచ్చిపోతుంది!” అని ఆయన బహిరంగ వేదికపై గట్టిగా హెచ్చరించారు.
ఓజీ విజయోత్సవ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ –
“నేను ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, చిరంజీవి, నాని అందరినీ అభిమానిస్తాను. ఒక హీరో అభిమాని అయి, మరో హీరోను ద్వేషించడం అంటే మనలో లోపం ఉన్నట్టు” అని సూటిగా చెప్పారు.
గేమ్ ఛేంజర్, దేవర, హరిహర వీరమల్లు వంటి భారీ సినిమాలు కూడా ఈ నెగటివ్ ట్రోలింగ్ బారిన పడుతున్నాయని ఆయన పరోక్షంగా చెప్పేశారు.
“అభిమానులారా… ఒకరినొకరు దెబ్బతీయడం ఆపండి. సినిమాను నిలబెట్టండి. లేకపోతే అసహ్యకరమైన వాతావరణం పెరుగుతుంది” అంటూ పవన్ కల్యాణ్ చేసిన హితవు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నెటిజన్లు కూడా పవన్ సందేశాన్ని ప్రశంసిస్తూ, “ఫ్యాన్ వార్స్ ఆగితేనే తెలుగు సినిమా బతుకుతుంది” అంటూ రియాక్ట్ అవుతున్నారు.
