ఒకపక్క రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా… మరోపక్క కోట్లాది మంది అభిమానుల కలల హీరోగా… పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటే అక్కడే చర్చ!.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పదవిని చేపట్టిన తర్వాత, ఆయన జీవితం పూర్తిగా ప్రజాసేవకు అంకితమైంది. కానీ, అదే సమయంలో ఆయన నటిస్తున్న సినిమాలపై అభిమానుల్లో ఉన్న ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. అయితే, తాజాగా పవన్ తీసుకున్న ఓ నిర్ణయం ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది!

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న “హరిహర వీర మల్లు” (Hari Hara Veera Mallu), “ఉస్తాద్ భగత్ సింగ్” (Ustaad Bhagat Singh) చిత్రాల షూటింగ్‌లు రాజకీయ భాద్యతల కారణంగా కొంతకాలంగా నిలిచిపోయాయి. ఈ రెండు చిత్రాలకు ఆయన అడ్వాన్స్ లుగా రూ. 20 కోట్లు, రూ. 15 కోట్లు రెమ్యునేషన్ గా తీసుకున్నారు. అసలు రెమ్యునరేషన్ ముట్టనేలేదు. అయితే సినిమాలు లేటు అవటంతో వడ్డీలు తడిసి మోపెడు అవుతాయని ఆయనకు తెలుసు. అందుకే ఆయన ఓ నిర్ణయం తీసుకుని అమలు పరిచారని సమాచారం. అదేమిటంటే..

అయితే, ఇటీవల పవన్ విజయవాడలో నిర్మాతలు ఏఎం రత్నం, మైత్రీ నవీన్‌లను ప్రత్యేకంగా పిలిపించి, ఒక బిగ్ డెసిషన్ తీసుకున్నారు. “ఇకపై రెమ్యునరేషన్ ఇవ్వొద్దు. ఆలస్యం అయినందుకు నేను బాధ్యత వహిస్తాను. షూటింగ్‌ను త్వరగా పూర్తిచేసి సినిమాను సమయానికి విడుదల చేయండి,” అంటూ క్లియర్ గైడెన్స్ ఇచ్చారు.

ఈ విషయం వినగానే నిర్మాతలు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. కానీ పవన్ డెడికేషన్, కమిట్‌మెంట్‌ను చూసి అందరూ మెచ్చుకుంటున్నారు.

OG మాత్రం మరో స్టోరీ!

ఇదిలా ఉంటే, పవన్ OG సినిమాకు మాత్రం పూర్తి రెమ్యూనరేషన్ ఇప్పటికే తీసుకున్నారు – అదికూడా 2024 ఎన్నికలకుముందే. OG షూటింగ్ ఫినిషింగ్ స్టేజ్‌లో ఉండగా, సెప్టెంబర్‌లో గ్రాండ్ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు.

ఇక హరిహర వీర మల్లు జూన్ 12న థియేటర్లలోకి రాబోతుంది.

, , ,
You may also like
Latest Posts from