
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజీ (ఓజాస్ గంభీరా) చుట్టూ అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. సుజీత్ స్టైలిష్ టేకింగ్, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ లా ఎంట్రీ ఇచ్చేయడంతో క్రేజ్ మరింత పెరిగింది. తాజాగా ట్రైలర్‌తో ఫ్యాన్స్ ఎగిరిపడుతుంటే, ఇప్పుడు మరో సర్‌ప్రైజ్ అప్‌డేట్ బయటకు వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చింది. మొదట సెప్టెంబర్ 25 అర్ధరాత్రి 1 గంటకు షో ప్లాన్ కాగా, ఇప్పుడు ఆ టైమింగ్ ముందుకు కదిలింది. అంటే సెప్టెంబర్ 24 రాత్రి 10 గంటలకు ప్రీమియర్ షోస్ స్టార్ట్ అవుతాయి. బెనిఫిట్ షో టికెట్ ధర ₹1000 (జీఎస్టీతో కలిపి) గా ఫిక్స్ చేశారు. అలాగే సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు ఏపీ సింగిల్ స్క్రీన్స్‌లో అదనంగా ₹125, మల్టీప్లెక్స్‌లలో ₹150 వరకూ రేట్లు పెంచుకునేందుకు అనుమతి లభించింది.
ఇక తెలంగాణలో అయితే మరింత ముందే ఫ్యాన్స్ ఫెస్టివల్ మొదలవుతుంది. అక్కడ సెప్టెంబర్ 24 రాత్రి 9 గంటలకే ప్రీమియర్స్ కిక్‌ఆఫ్ అవుతున్నాయి. స్పెషల్ షో టికెట్ ధర ₹800 (జీఎస్టీతో) గా నిర్ణయించారు. సినిమా రిలీజ్ డే నుంచి అక్టోబర్ 4 వరకు సింగిల్ స్క్రీన్స్‌లో ₹100, మల్టీప్లెక్స్‌లలో ₹150 అదనంగా వసూలు చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇప్పటికే ఫ్యాన్స్ మధ్య ఎమోషన్ పీక్స్‌లో ఉంది. కొత్త టైమింగ్స్, హై టికెట్ రేట్స్ చూసి సోషల్ మీడియాలో మాస్ ఫెస్ట్ జరుగుతోంది. ఇప్పుడు ఒక్క ప్రశ్న – OG కేవలం అంచనాలకే పరిమితమవుతుందా? లేక నిజంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందా?
మరి, ఈ ఓజీ ప్రీమియర్స్ ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేసినంత బ్లాక్‌బస్టర్ హంగామా క్రియేట్ చేస్తాయో లేదో చూడాలి!
