అందరూ ఊహించినట్లుగానే చిత్ర పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే బాఫ్టా (బ్రిటిష్‌ అకాడమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌) (BAFTA Awards) అవార్డుల పోటీలో ‘ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌’ నిలిచింది. లాంగ్‌లిస్ట్‌లో బెస్ట్‌ డైరెక్టర్‌, బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే, బెస్ట్‌ ఫిల్మ్‌ నాట్‌ ఇన్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ విభాగాల్లో నామినేట్‌ అయిందీ చిత్రం. అయితే ఈ సినిమా.. అనేక పిల్టర్స్ చేసిన తర్వాత ‘ఫిల్మ్‌ నాట్‌ ఇన్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌’ కేటగిరిలో మాత్రమే పోటీ పడనుంది. తాజా జాబితాను జ్యూరీ విడుదల చేసింది. అందులో ఈ సినిమా ఉంది.

లండన్‌ వేదికగా ఫిబ్రవరి 16న అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ చిత్రం (All We Imagine As Light) కేన్స్‌ ఉత్సవంలో ‘గ్రాండ్‌ పిక్స్‌’ అవార్డు గెలుచుకుంది.

30 ఏళ్ల తర్వాత భారతీయ చిత్రానికి దక్కిన గౌరవమిది. బెస్ట్‌ నాన్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ మోషన్‌ పిక్చర్, బెస్ట్‌ డైరెక్టర్‌ విభాగాల్లో ఈ చిత్రం గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులకు నామినేట్‌ అయింది.

ప్రస్తుతం ఓటీటీ ‘డిస్నీ+హాట్‌స్టార్‌’లో స్ట్రీమింగ్‌ అవుతోంది. పాయల్‌ కపాడియా తెరకెక్కించిన ఈ సినిమాలో కని కుశ్రుతి, దివ్య ప్రభ ప్రధాన పాత్రల్లో నటించారు.

కథేంటి:

ముంబయి నర్సింగ్‌హోమ్‌లో పనిచేసే కేరళకు చెందిన ఇద్దరు నర్సుల (ప్రభ, అను) కథే ‘ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌ (All We Imagine as Light)’. ప్రభ, అను పనిచేసే ఆస్పత్రిలోనే వంట మనిషిగా పనిచేస్తూ ఉంటుంది పార్వతి (ఛాయా కదమ్‌).

జీవితంలో సమస్యలు ఎదుర్కోలేక సొంతూరు రత్నగిరి వెళ్లిపోవాలనుకుంటుంది పార్వతి. ఈక్రమంలోనే నిత్యం కష్టాలు పడుతున్న ప్రభ, అను కూడా ఆమెతో కలిసి రత్నగిరి వెళ్తారు. మరి అక్కడికి వెళ్లాక వాళ్లకు ఎదురైన పరిస్థితులు ఏంటి? ప్రభ తన భర్తను కలిసిందా? అను, షియాజ్‌ల ప్రేమ ఏమైంది? తదితర అంశాలతో రూపొందిదీ చిత్రం.

,
You may also like
Latest Posts from