సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రాజమౌళి చేయబోతున్న చిత్రం గురించిన వార్తలే ఇప్పుడు ఎక్కడ చూసినా. ఈ పాన్ వరల్డ్ సినిమా గురించి కేవలం మహేష్ అభిమానులు మాత్రమే కాకుండా సినిమా లవర్స్ మొత్తం ఎదురుచూస్తున్నారు. కొత్త ఏడాది ప్రారంభంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తైంది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే… షూటింగ్ షురూ చేయడానికి రాజమౌళి రెడీ అయ్యారు.

ఈ విషయాన్ని ఖరారు చేస్తూ రాజమౌళి శుక్రవారం రాత్రి సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేశారు. అందులో సింహాన్ని బోనులో బంధించినట్టు ఉంది. అలాగే ఒక పాస్ పోర్ట్ చూపిస్తూ ఫోటోకు పోజ్ ఇచ్చారు. మీకు గుర్తు ఉందా? గతంలో అదే సింహం ఫోటో షేర్ చేసిన రాజమౌళి… ఆ సింహం మీద మహేష్ బాబును ట్యాగ్ చేశారు. ఇప్పుడు ఆ సింహాన్ని బోనులో లాక్ చేసినట్లు అర్థం వచ్చేలా వీడియో షేర్ చేశారు.

రాజమౌళి ఇనిస్ట్రా పోస్ట్‌కు కామెంట్‌ బాక్స్‌లో మహేశ్‌బాబు కూడా వైల్డ్ గా రియాక్ట్ అయ్యారు. ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను..’ అంటూ రెస్పాండ్‌ అయ్యాడు. ఆపై నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar) కూడా చప్పట్ల ఎమోజీతో చిత్ర యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పింది.

అయితే, ‘ఫైనల్లీ’ అంటూ బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కామెంట్‌ బాక్స్‌లో రియాక్ట్‌ కావడం విశేషం. ఇలా రాజమౌళి చేసిన పోస్ట్‌కు చాలామంది సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. రాజమౌళి పాస్‌పోర్ట్‌ చూపిస్తూ సింహం ఫోటోతో పోజ్‌ ఇచ్చారు. దీంతో SSMB29 సినిమా షూటింగ్‌ ప్రారంభమైనట్లేనని మహేశ్‌ అభిమానులు అనుకుంటున్నారు.

మరో ప్రక్క హీరోయిన్‌ ప్రియాంక చోప్రా ఇప్పటికే హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. SSMB29 ప్రాజెక్ట్‌ కోసమే ఆమె ఇక్కడకు వచ్చి లుక్ టెస్ట్ చేసింది తాజాగా రాజమౌళి చేసిన పోస్ట్‌కు ఫైనల్లీ అంటూ ఆమె రెస్పాండ్‌ అయ్యారు. దీంతో మహేశ్‌బాబు- ఎస్‌ఎస్‌ రాజమౌళి సినిమాలో ప్రియాంక చోప్రానే హీరోయిన్‌ అని క్లారిటీ వచ్చేసింది.

ఈ చిత్రంలో మహేశ్‌బాబుకి జోడీగా నటించే హీరోయిన్ల జాబితాలో ప్రియాంకా చోప్రా, కియారా అద్వానీ, ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్‌గా ప్రియాంకా చోప్రాని హీరోయిన్ గా ఫిక్స్‌ చేశారని పరోక్షంగా క్లారిటీ వచ్చేసింది. త్వరలో అధికారికంగా ప్రకటన రావచ్చు అని తెలుస్తోంది.

భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని ఈ చిత్రంలో రాజమౌళి ఆవిష్కరించబోతున్నారని రచయిత విజయేంద్రప్రసాద్‌ ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథ రెండు భాగాలుగా రానుంది. తొలి భాగాన్ని 2027లో విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో హాలీవుడ్‌ నటీనటులతో పాటు టెక్నీషియన్స్‌ కూడా ఇందులో భాగం కానున్నారు.

, , , ,
You may also like
Latest Posts from