ప్రిన్స్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకుడు రాజమౌళి ( SS Raja mouli) కాంబినేషన్ లో ఓ భారీ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే SSMB 29 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ వార్త అంతటా వైరల్ అవుతోంది.

ఈ సినిమా కోసం మరో దర్శకున్ని రంగంలోకి దింపుతున్నాడట రాజమౌళి. మహేష్ బాబు సినిమా కోసం డైలాగ్ రైటర్ గా దర్శకుడు దేవా కట్టా ( Deva Katta) పని చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అంతేకాదు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డైలాగ్ పార్ట్ మొత్తం కూడా ఫినిష్ కూడా చేసినట్లు చెబుతున్నారు. మహేష్ బాబుకు తగ్గట్టుగా పవర్ఫుల్ డైలాగులు రాసినట్లు సమాచారం అందుతుంది.

గతంలో ఆటోనగర్ సూర్య, రిపబ్లిక్ అలాగే ప్రస్థానం లాంటి సినిమాలకు దర్శకుడిగా దేవా ( Deva Katta ) పనిచేసిన సంగతి తెలిసిందే.
బాహుబలి సినిమా సమయంలో కూడా రాజమౌళికి సహాయం చేశాడు దేవా కట్టా. ఇప్పుడు మళ్లీ రాజమౌళితో జత కడుతున్నాడు.

ఇది ఇలా ఉండగా రాజమౌళి అలాగే మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంఎం కీరవాణి ( MM Keeravani ) చేస్తున్నారు.

, , , , ,
You may also like
Latest Posts from