రజినీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న మాస్ యాక్షన్ డ్రామా ‘కూలీ’ ఓవర్సీస్ లో ఇప్పుడే సంచలనం సృష్టిస్తోంది. ఇంకా ట్రైలర్ కూడా రాలేదు, రిలీజుకు రెండు వారాల టైమ్ ఉంది. కానీ అప్పుడే ప్రీ బుకింగ్స్ దుమ్ము రేపుతున్నాయి!

యూఎస్‌, కెనడా, ఆస్ట్రేలియా, యూకే సహా పలు ప్రాంతాల్లో ఒక్కొక్కటిగా బుకింగ్స్ ఓపెన్ అవుతుండగా… అక్కడే అదిరిపోయే అడ్వాన్స్ బిజినెస్ జరుగుతోంది. ట్రైలర్ లేకపోయినా, ఒక్క రజినీ – లోకేశ్ పేరుతోనే థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టేలా బుక్ అవుతోంది!

ఇప్పటికే ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ దాదాపు $1 మిలియన్ మార్క్ దాటేసినట్టు ట్రేడ్ టాక్. ఇది కోలీవుడ్ లో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలోనే చెబుతున్నారు. ఈ వారం జరిగే గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ట్రైలర్ రిలీజయ్యే ఛాన్స్ ఉంది. అదే సమయంలో మరిన్ని దేశాల్లో షోలు, బుకింగ్స్ కూడా స్టార్ట్ కానున్నాయి.

ఇకపోతే, ఇప్పటి వరకు విజయ్ ‘లియో’ ఓవర్సీస్ లో $8 మిలియన్+ ఓపెనింగ్ తో టాప్‌లో ఉంది. కానీ ‘కూలీ’ దాన్ని బ్రేక్ చేసే లెవెల్లో ఉంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ఇది $10 మిలియన్ ఓపెనింగ్ సాధించే తొలి కోలీవుడ్ చిత్రం అయ్యే అవకాశాలున్నాయి!

, , , , , ,
You may also like
Latest Posts from