నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఫుల్ యాక్షన్ మోడ్‌లోకి దిగింది! రొమాన్స్‌తోనూ కవ్విస్తోంది, ఇంకా… లిప్ కిస్ సీన్ కూడా స్పెషల్ గా పెట్టేసింది! ఇదంతా ఆమె అప్‌కమింగ్ హారర్-కామెడీ థ్రిల్లర్ ‘థామా’ కోసం.

ఈ బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ టీజర్ ఈ రోజు (ఆగస్టు 19) రిలీజ్ అయ్యింది. యాక్షన్, రొమాన్స్, కామెడీ, ట్విస్ట్‌లతో టీజర్ అదిరిపోయింది. ఫ్యాన్స్ ఉత్సాహం ఆకాశానికి చేరింది!

“ఒక్క క్షణం కూడా కాదు” – రష్మిక vs ఆయుష్మాన్

మాడాక్ ఫిల్మ్స్ చివరికి థామా టీజర్ ను అందించింది. ఒక బ్లడీ లవ్ స్టోరీ గా ప్రమోట్ చేస్తూ, ఫ్యాన్స్‌ హృదయాలను దడపెట్టించింది.

టీజర్ స్టార్ట్: ఆయుష్మాన్ ఖురానా వాయిస్ ఓవర్ –
“నువ్వు నేను లేకుండా 100 సంవత్సరాలు జీవించగలవా?”

రష్మిక రెస్పాన్స్:
“ఒక్క క్షణం కూడా కాదు.”

ఆ తర్వాత భయంకరమైన విలన్ మెరుపులతో వస్తాడు. రష్మిక నొప్పి, కోపంతో అరుస్తూ, ఒక్కసారిగా టోన్ 180° లోకి మార్చేసింది !


మలైకా అరోరా స్పెషల్ సాంగ్

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ఓ స్పెషల్ సాంగ్‌లో హీటింగ్ చేస్తోంది.

కో స్టార్స్:

  • పరేష్ రావల్
  • ఫైసల్ మాలిక్
  • మలైకా అరోరా
  • నవాజుద్దీన్ సిద్ధికీ

టీజర్‌లో ఆయుష్మాన్ & రష్మిక ప్రేమ కోసం తాకట్టు పడుతూ, మధ్యలో లిప్ కిస్ సీన్ స్పెషల్‌గా మారింది . ఇకేంటి, నవాజుద్దీన్ విలన్‌గా ఎంట్రీ…

మేకర్స్ హైప్

“భయం ఎప్పుడూ ఇంత శక్తివంతంగా లేదు. ప్రేమ ఎప్పుడూ ఇంత రక్తసిక్తంగా లేదు! ఈ దీపావళికి మాడాక్ హారర్-కామెడీ యూనివర్స్‌లో మొట్టమొదటి ప్రేమకథ కోసం సిద్ధంగా ఉండండి. థామా – మునుపెన్నడూ లేని సినిమా అనుభవం, ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో!”

, , , , ,
You may also like
Latest Posts from