
ఆయుష్మాన్ ఖురానా (Ayushmann Khurrana), రష్మిక (Rashmika Mandanna) ప్రధాన పాత్రల్లో ఆదిత్యా సర్పోత్దార్ తెరకెక్కించిన చిత్రం ‘థామా’ (Thamma). హారర్ కామెడీగా రూపొందిన ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే… రష్మిక మందన్నా అందులో చేయటం. 2025లో చేసిన రష్మిక చేసిన మూడో హిందీ సినిమా ‘థమ్మా’. ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూలు వచ్చినా సూపర్ ఓపెనింగ్ సాధించింది.
ఇది ఆమె కెరీర్‌లో మొదటిసారిగా వాంపైర్ పాత్ర పోషించిన చిత్రం. ఇక ఈ ఏడాది మొదట్లో వచ్చిన బ్లాక్‌బస్టర్ “ఛావా” తర్వాత, ఇదే రష్మిక యొక్క 2025 చివరి బాలీవుడ్ రిలీజ్ కావడం విశేషం.
అదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, ఆయుష్మాన్ ఖురానా – రష్మిక మందన్నా జంటతో వాంపైర్ ప్రేమకథను భారతీయ బేతాళ పురాణంతో కలిపిన ఫాంటసీ డ్రామా.
ఫస్ట్ డే కలెక్షన్ షాక్ ఇచ్చింది!
సినిమా మొదటి రోజే భారతదేశంలో ₹25.11 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది.
ఫెస్టివ్ సీజన్ అడ్వాంటేజ్ తో పాటు, ట్రైలర్ క్రేజ్ కూడా భారీ ఓపెనింగ్‌కి కారణమైంది.
ప్రేక్షకులు రష్మిక – ఆయుష్మాన్ కెమిస్ట్రీ, పాటలు, విజువల్స్‌కి థంబ్స్ అప్ ఇచ్చారు. అయితే విమర్శకులు మాత్రం సినిమా పేసింగ్ స్లోగా ఉందని, హారర్ ఎలిమెంట్స్ తక్కువగా ఉన్నాయని కామెంట్ చేశారు.
కానీ ఈ నెగటివ్ రివ్యూల మధ్యా కూడా ‘థమ్మా’ థియేటర్లలో గర్జిస్తోంది. వీకెండ్ బాక్సాఫీస్ రన్‌నే సినిమా భవితవ్యాన్ని నిర్ణయించనుంది.
