రజాకార్ సైలెంట్ జినోసైడ్ ఆఫ్ హైదరాబాద్.. గతేడాది మార్చి 24న థియేటర్లలో రిలీజైన మూవీ ఇది. రిలీజై ఇంతకాలం అయినా డిజిటల్ రిలీజ్ కు నోచుకోలేదు. రకరకాల కారణాలతో ఓటిటి రిలీజ్ లేటు అవుతూ వచ్చింది. మొత్తానికి ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న ఆహా వీడియో ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని వెల్లడిచింది. యాటా సత్యనారాయణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అనసూయతోపాటు బాబీసింహ, ఇంద్రజ, వేదికలాంటి వాళ్లు నటించారు.
ఈ రజాకార్ మూవీ థియేటర్లలో రిలీజైన పది నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఆహా వీడియో ఓటీటీ జనవరి 24 నుంచి సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది.
“ధైర్యం, చరిత్ర, ఎవరూ చెప్పని స్టోరీ.. రజాకార్ జనవరి 24న ఆహా వీడియోలో ప్రీమియర్ కానుంది” అనే క్యాప్షన్ తో ఆహా వీడియో ఓటీటీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సందర్భంగా వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ స్పెషల్ పోస్టర్ ను కూడా లాంచ్ చేసింది. రిపబ్లిక్ డేకు రెండు రోజుల ముందు నుంచి ఈ చారిత్రక నేపథ్యంలో సాగే మూవీ స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.
నిజాం పాలనలో రజాకార్లు ఎలాంటి దురాగతాలు, హింసలకు పాల్పడ్డారనే అంశాలతో దర్శకుడు యాటా సత్యనారాయణ రజాకార్ మూవీని తెరకెక్కించాడు. యథార్థ ఘటనల స్ఫూర్తితో ఈ కథను రాసుకున్నాడు.
తెలంగాణ సాయిధ పోరాటంలో అమరులైన చాలా మంది యోధుల జీవితాలతో ఎమోషనల్‌గా ఈ మూవీ సాగుతుంది. ఓ వైపు ప్రజా పోరాటం, మరోవైపు రజాకర్ల దురాగతాలు వీటికి సమాంతరంగా హైదరాబాద్‌ను ఇండియాలో విలీనం చేసేందుకు పటేల్ చేసిన ప్రయత్నాల చుట్టూ కథను అల్లుకున్నారు.