రామ్ గోపాల్ వర్మ మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టినట్లున్నారు. తన డెన్ నుంచి ఓ సినిమా వదులుతున్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఓ థ్రిల్లర్ . సోషల్ మీడియాలో అమాయకంగా ప్రేమలో పడడం, అది ఎలాంటి భయానక పరిణామాలకు దారితీస్తుందో చూపించే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిందని చెప్తున్నారు. వర్మ ఈ సినిమాకు కథను అందించగా గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ వదిలారు.
శారీ ప్రధానంగా ఓ అమ్మాయి చీరలో కనిపించడాన్ని చూస్తున్న అబ్బాయి, ఆమెను వెంబడించడం, చివరకు ఆ క్రమంలో చోటు చేసుకునే భయంకర పరిణామాలను హైలెట్ చేస్తోంది.
ట్రైలర్‌లో ఫొటోగ్రాఫర్‌గా ఉన్న యువకుడు ఓ అమ్మాయిని చూసి ఆకర్షితుడవుతాడు. ఆమెను సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తాడు. అంతటితో ఆగకుండా ఆమె జీవితంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఆ తర్వాత ఏమి జరుగుతుందనేది అసలు మెలిక.