‘కరోనా వస్తే 14 రోజులు క్వారంటైన్.. అదే నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్’ అంటూ నితిన్ చెప్పే డైలాగ్ తో రాబిన్ హుడ్ ట్రైలర్ వచ్చేసింది. నితిన్ (Nithiin), స్టార్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) ప్రధాన పాత్రల్లో నటించిన అవెయిటెడ్ మూవీ ‘రాబిన్ హుడ్’ (Robinhood) ట్రైలర్ వచ్చేసింది.

ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ చేతుల మీదుగా మూవీ టీం ట్రైలర్ లాంఛ్ చేసింది. డైరక్టర్ వెంకీ కుడుముల తెరకెక్కించిన ఈ మూవీ ఈ నెల 28న థియేటర్లలోకి రానుంది.

ఓ సెక్యూరిటీ ఏజెన్సీలో గార్డుగా పని చేస్తూనే డిఫరెంట్ వేషాలు వేస్తూ.. సైబర్ టెక్నిక్స్ ఉపయోగించి దొంగతనాలు చేస్తుంటాడు రామ్ అలియాస్ రాబిన్ హుడ్ (నితిన్). దొంగతనాలు, అండర్ కవర్ ఆపరేషన్లతో అలా నెట్టుకుంటూ వస్తున్న రామ్ జీవితంలోకి ఒక ఎన్ఆర్ఐ అమ్మాయి నీరా వాసుదేవ్ (శ్రీలీల) వస్తుంది.

ఆమె సెక్యూరిటీ బాధ్యతను తీసుకుంటాడు. అయితే ఒక మారుమూల కొండప్రాంతంలో చట్టవిరుద్ధంగా మాదకద్రవ్యాలు సాగు చేస్తున్న సామి (దేవదత్త నాగ) సామ్రాజ్యంలోకి రాబిన్ హుడ్ అడుగుపెడతాడు. ఇక అక్కడి నుంచి ఛేజులు, ఫైట్లు. తర్వాత జరిగేదే స్టోరీ.

ట్రైలర్‌లో వార్నర్ ఎంట్రీ అదిరిపోయింది. హెలికాఫ్టర్ నుంచి నోట్లో లాలీపాప్ పెట్టుకుని ఫుల్ సెక్యూరిటీతో స్టైలిష్ లుక్‌లో వార్నర్ దిగే సీన్ హైలెట్‌గా నిలిచింది.

, , ,
You may also like
Latest Posts from