‘దబాంగ్’ (2010)తో సల్మాన్ ఖాన్ ఇమేజ్‌కు మాస్ లెవెల్ బూస్ట్ ఇచ్చిన డైరెక్టర్ అభినవ్ కశ్యప్ ఇప్పుడు షాకింగ్ ఆరోపణలతో రంగంలోకి దిగాడు. ఒక ప్రముఖ మీడియా ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు పరిశ్రమ మొత్తాన్ని షేక్ చేస్తున్నాయి.
“సల్మాన్‌కు నటనంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు”
అభినవ్ స్ట్రైట్‌గా ఫైర్ చేస్తూ – “సల్మాన్‌కు యాక్టింగ్ మీద ఆసక్తి లేదు, గత 25 ఏళ్లుగా అదే స్టైల్. సెట్‌లోకి వచ్చి, మనకు ఏదో ఉపకారం చేస్తున్నట్టు బిహేవ్ చేస్తాడు. అతడికి స్టార్ పవర్‌ను ఎంజాయ్ చేయడం తప్ప, నటనలో డెడికేషన్ లేదు” అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
“అతడో గూండా… మర్యాద లేని చెడ్డ మనిషి”
ఇంకా ఒక అడుగు ముందుకేసి… “సల్మాన్ గూండా! దబాంగ్ చేయకముందు నాకు ఈ విషయం తెలియదు. అతడు మర్యాద లేని చెడ్డ మనిషి” అని బ్లంట్‌గా అనేశాడు.
అంతేకాదు అభినవ్ టార్గెట్ ఇక్కడితో ఆగలేదు. నేరుగా సల్మాన్ కుటుంబంపైనే ఫైర్ చేశాడు: “సల్మాన్ ఫ్యామిలీ 50 ఏళ్లుగా పరిశ్రమలో రూట్స్ వేసుకుని స్టార్ సిస్టమ్‌ని నడిపిస్తోంది. వాళ్లు ప్రతీకార ధోరణి ఉన్నవాళ్లు. ఎవరు విభేదించినా వెంటపడతారు, టార్చర్ చేస్తారు” అని బలమైన ఆరోపణలు చేశాడు.
అనురాగ్ కశ్యప్ ఎపిసోడ్ రీకాల్
ఈ ఫైట్‌లో తన అన్న, డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌కూ ఇలాంటిదే జరిగిందని చెప్పాడు: “‘తేరే నామ్’ కోసం అనురాగ్ రాసిన స్క్రిప్ట్‌ని సల్మాన్ వదిలేశాడు. నిర్మాత బోనీ కపూర్ కూడా అతడితో తప్పుగా ప్రవర్తించాడు. చివరికి స్క్రిప్ట్ రాసినా, క్రెడిట్ కూడా ఇవ్వలేదు.” “అనురాగ్‌కి ముందే సల్మాన్ నిజ స్వభావం తెలిసిపోయింది. తనను సులభంగా బెదిరిస్తారని అనుకున్నాడు” అని అభినవ్ రివీల్ చేశాడు.
దబాంగ్ 2 ఎందుకు డైరెక్ట్ చేయలేకపోయాడు?
అభినవ్ చెప్పినట్లు సల్మాన్ ఫ్యామిలీ బెదిరింపులు, కాంట్రవర్శీలు కారణంగానే దబాంగ్ 2 కి డైరెక్టర్‌గా కొనసాగలేకపోయాడని బాలీవుడ్ అంటోంది.
బాలీవుడ్‌లో “ఖాన్ డామినేషన్” అనే రియాలిటీ గురించి అప్పుడప్పుడూ బయటికి వచ్చే ఈ తరహా రివలేషన్స్ పరిశ్రమలో స్టార్ పవర్ ఎంత డేంజరస్‌గా ఉందో రీమైండ్ చేస్తాయి. సల్మాన్ ఫ్యాన్స్‌కు ఇవి షాక్ కావచ్చు, కానీ ఇలాంటి కామెంట్స్ మరోసారి “స్టార్ vs టాలెంట్” డిబేట్‌ని రీ–ఓపెన్ చేశాయి.
అభినవ్ మాటల్లో నిజం ఎంత? లేక ఇది పర్సనల్ గ్రడ్జ్‌నా? సమాధానం బాలీవుడ్ హాట్‌సీట్లోనే ఉంది!