షారుక్‌ ఖాన్‌తో చేసిన ‘జవాన్‌’ సూపర్ సక్సెస్ తర్వాత తమిళ దర్శకుడు అట్లీకి బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేయడానికి అట్లీ చాలా ఆసక్తి చూపాడు.

సల్మాన్ కూడా ఉత్సాహంగా చర్చల్లో పాల్గొన్నాడు. కథ నచ్చింది. ఈ సినిమాను దక్షిణాదిలోని అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సన్‌ పిక్చర్స్‌ నిర్మించనుందని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్‌ వైరల్‌ అయింది. అయితే అనుకోకుండా ఈ ప్రాజెక్టు అటకెక్కింది.

ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద భారీ చిత్రంలో అల్లు అర్జున్‌తో కలిసి పనిచేయడానికి అట్లీ సిద్ధంగా ఉన్నాడు. అదే సమయంలో సల్మాన్ ఖాన్ తన తదుపరి చిత్రానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయమై సల్మాన్ క్లారిటీ ఇచ్చాడు. తన రాబోయే చిత్రం సికందర్ ప్రమోషన్స్ సందర్భంగా సల్మాన్ అట్లీ సినిమా గురించి స్పందించాడు.

సల్మాన్ మాట్లాడుతూ…”అట్లీ ఒక భారీ-బడ్జెట్ యాక్షన్ చిత్రానికి రాశారు. చిత్రం ఇప్పుడు ఆలస్యమైంది. అందుకు కారణం దాని బడ్జెట్ . అలాగే ఈ చిత్రంలో మరో కీ రోల్ వేసే నటుడు ఎవరనేది క్లారిటీ రాలేదు. భారీ కొలేబరేషన్స్ జరగాలంటే సరైన స్క్రిప్ట్ అవసరం. నేను ఇప్పుడు నా తదుపరి చిత్రానికి మారాను” అని సల్మాన్ ఖాన్ చెప్పారు. అయితే, అట్లీతో సినిమా ఉంటుందని మాత్రం ఆయన చెప్పుకొచ్చారు.

అప్పట్లో అట్లీ ఈ చిత్రంలో ఇతర ప్రధాన నటుడి కోసం వేటను కూడా ప్రారంభించాడు. కమల్ హాసన్ మరియు రజనీకాంత్ వంటి పేర్లు బయిటకు వచ్చాయి.

, ,
You may also like
Latest Posts from