బాలీవుడ్ కు మన తెలుగు దర్శకులు అంటే మంట మరీ ఎక్కువగా ఉన్నట్లుంది. నిర్మాతల తీరు అలా కనిపిస్తోంది. కేవలం అసూయ వారిని అలా బిహేవ్ చేసేలా చేస్తోందని అంటున్నారు.ఇంతకీ ఏం జరిగింది. తాజడాగా ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ బండారాన్ని బయిటపెట్టారు. ‘కబీర్ సింగ్’ సినిమాలో నటించాడనే కారణంతో ఒక సపోర్టింగ్ యాక్టర్ కు పెద్ద నిర్మాణ సంస్థ ఒప్పుకోలేదనే షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు.
‘కబీర్ సింగ్’ సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసిన ఓ నటుడికి బడా బాలీవుడ్ నిర్మాణ సంస్థ తమ సినిమాలో నటించే ఛాన్స్ ఇవ్వలేదని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తాజాగా విమర్శించారు. అయితే ఆయన సదరు నిర్మాణ సంస్థ లేదా నటుడి పేరు బయట పెట్టలేదు. ఆ నటుడి పట్ల ఇలా పక్షపాతంతో వ్యవహరించినందుకు చిరాకు వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
రీసెంట్ గా కోమల్ నహతాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగా ‘కబీర్ సింగ్’లో నటించిన నటుడిని ఎందుకు రిజెక్ట్ చేశారో వివరించారు. ఇలా అన్యాయంగా వ్యవహరించడంపై సందీప్ రెడ్డి వంగా స్పందిస్తూ మండిపడ్డారు. మెయిన్ యాక్టర్స్ కు కూడా ఈ రూల్స్ వర్తించాలని అన్నారాయన.
సదరు సపోర్టింగ్ యాక్టర్ తన అవకాశం ఎలా చేజారింది అన్న విషయాన్ని సందీప్ రెడ్డి వంగాకు స్వయంగా ఫోన్ చేసి చెప్పాడట. ఆ టైమ్ లో సందీప్ సదరు నటుడితో “ఒకవేళ అదే గనుక ప్రాబ్లం అయితే… నువ్వు తిరిగి వెళ్లి సందీప్ ఇప్పుడు రణబీర్ కపూర్ తో కలిసి సినిమా చేయబోతున్నాడని చెప్పు” అని అన్నారట.