సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam)రికార్డ్ ల మీద రికార్డ్ లు బ్రద్దలు కొడుతూనే ఉంది. తాజాగా ఈ మూవీ మరో రేర్ రికార్డ్ ను తన ఖాతాలో వేసుకుంది. జనవరి 15న జనం ముందుకు వచ్చిన ఈ సినిమా ఇటీవలే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. అయినా సరే థియేటర్ లో దుమ్ము రేపుతోంది.

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఓ పక్క ఓటీటీలో సందడి చేస్తున్నా… ఏకంగా 92 కేంద్రాలలో ఇప్పటికీ ఆడుతోంది. 50వ రోజు నాటికి ఇన్ని కేంద్రాలలో ఓ ప్రాంతీయ చిత్రం థియేటర్లలో ఉండటం ఓ రకంగా విశేషమనే చెప్పాలి. సినిమా ప్రదర్శితమౌతున్న 92 సెంటర్స్ జాబితాను నిర్మాతలు ప్రకటించారు.

కానీ ట్విస్ట్ ఏమిటంటే , ఏ యే కేంద్రాలలో ఇది డైరెక్ట్ గా యాభై రోజులుగా ఆడుతోంది, ఏవేవి షిఫ్టింగ్ థియేటర్స్ అనే వివరాలు మాత్రం ఇవ్వలేదు.

ఇప్పటికే థియేట్రికల్ గా ఈ సినిమా రూ. 300 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి, సీనియర్ స్టార్ హీరోల సినిమా కలెక్షన్స్ లో అగ్రస్థానంలో నిలిచింది.

విక్టరీ వెంకటేశ్‌, ఐశ్వర్య రాజేశ్‌, మీనాక్షి చౌదరి కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించగా, అనిల్ రావిపూడి డైరెక్ట్ చేశారు.

, , , ,
You may also like
Latest Posts from