టాలీవుడ్‌ ని షాక్‌కు గురిచేసే వార్త బయటకొచ్చింది. ఇప్పటివరకు వరుస సినిమాల్లో థమన్‌తో కలిసి హిట్ మ్యూజిక్ అందించిన త్రివిక్రమ్, ఇప్పుడు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వైపు మొగ్గు చూపుతున్నాడట. ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న టాక్ ఏంటంటే… త్రివిక్రమ్ ఇటీవల “యానిమల్” ఫేమ్ హర్షవర్ధన్ రమేశ్వర్‌తో రహస్యంగా మీటింగ్ చేసాడట. ఈ సీక్రెట్ చర్చ బయటకు రావడంతో, “త్రివిక్రమ్ తన మ్యూజిక్ డైరెక్టర్‌ని మార్చేస్తాడా?” అనే డౌట్ మొదలైంది.

అయితే ఇంకా అధికారికంగా సైన్ చేయలేదుగానీ, వీరిద్దరి కాంబినేషన్ కుదిరే అవకాశాలు బలంగానే ఉన్నాయని టాక్.

బ్యాక్‌స్టోరీ:

‘అరవింద సమేత’ నుంచి ఇప్పటివరకు వరుసగా థమన్‌తో కలిసి త్రివిక్రమ్ దుమ్మురేపాడు. కానీ ఇప్పుడు సడన్‌గా హర్షవర్ధన్ వైపు మొగ్గు చూపడం వెనుక రీజన్ ఏంటి? థమన్ మ్యూజిక్‌పై త్రివిక్రమ్ సంతృప్తి లేడా? లేక కొత్తగా ఏదైనా ఫ్రెష్ సౌండ్ కావాలనుకుంటున్నాడా?

ప్రాజెక్ట్స్:

త్రివిక్రమ్ దగ్గర లైన్‌లో ఉన్న రెండు భారీ సినిమాలు –

ఎన్టీఆర్ హీరోగా మురుగన్ మైథలాజికల్ డ్రామా

వెంకటేష్‌తో ఎమోషనల్ డ్రామా (ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి, షూట్ నవంబర్‌ నుంచి)

ఇవే హర్షవర్ధన్‌తో కలిపే ప్రాజెక్ట్స్ అవుతాయా? అన్న క్యూరియాసిటీ ఇండస్ట్రీని కుదిపేస్తోంది.

ఏదైమైనా త్రివిక్రమ్ – హర్షవర్ధన్ రమేశ్వర్ మీటింగ్ బయటకు రావడంతో ఇండస్ట్రీ వర్గాల్లో ఒక్కసారిగా క్యూరియాసిటీ పెరిగిపోయింది.

‘నువ్వే నువ్వే’ నుంచి ఇప్పటివరకు కోటి, మణిశర్మ, దేవి శ్రీ ప్రసాద్, మిక్కీ జే మేయర్, అనిరుద్, థమన్‌లతో కలిసి పనిచేసిన త్రివిక్రమ్, అందరి నుంచి గుర్తుండిపోయే ట్యూన్స్ రాబట్టాడు. ఇప్పుడు కొత్తగా హర్షవర్ధన్ రమేశ్వర్‌ని సెట్ చేస్తే… ఇది మ్యూజిక్ సెన్సేషన్ అవుతుందా లేక కాంట్రవర్శీగా మారుతుందా అన్నది చూడాలి.

, , , , , ,
You may also like
Latest Posts from