మలయాళ సినీ నటుడు షైన్ టామ్ చాకోపై ఇప్పటికే నటి విన్సీ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సెట్స్‌లో డ్రగ్స్ వాడతాడంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు పరిశ్రమలో కలకలం రేపాయి. ఈ ఆరోపణలపై చాకో స్పందిస్తూ విన్సీకి భేషరతుగా క్షమాపణలు చెప్పాడు. ‘అమ్మ’ అసోసియేషన్ ఆగ్రహానికి గురికాకుండా వ్యవహారాన్ని శాంతంగా ముగించేశాడు.
విన్సీ కూడా ఈ వ్యవహారాన్ని కోర్టుకు తీసుకెళ్ళే ఉద్దేశం లేదని, అంతర్గతంగానే పరిష్కరించుకుంటామని వెల్లడించింది. అంతా ఆగిపోతుందని అనుకుంటున్న సమయంలో మళ్లీ ఈ వివాదం మళ్లీ ఊపందుకుంది.
ఇప్పటికి మరో నటి తెరపైకి వచ్చారు. అవును… చాకో డ్రగ్స్ వాడతాడని ఆరోపణ చేసిన వ్యక్తి నటి అపర్ణ జోన్స్. షైన్‌తో ఓ చిత్రంలో కలిసి పనిచేసిన అపర్ణ, సెట్స్‌లో అతడి ప్రవర్తన గురించి సంచలన ఆరోపణలు చేసింది.
“విన్సీ చెప్పినవి పూర్తిగా నిజం,” అని చెప్పిన అపర్ణ, “షైన్ షూటింగ్ సెట్స్‌లో తెల్లటి పౌడర్ తినే వారిని చూసేదాన్ని. మొదట గ్లూకోజ్ అనుకున్నాను. కానీ తర్వాత అతడి ప్రవర్తన చూస్తే తీవ్రమైన అనుమానాలు వచ్చాయి,” అని చెప్పింది.
అంతేకాదు, “చాకో సెట్స్‌లో ఎప్పుడూ కలియదిరుగుతాడు. అసభ్యంగా మాట్లాడతాడు. ప్రత్యేకించి హీరోయిన్ల సమక్షంలో అతడి ప్రవర్తన మరింత దిగజారుతుంటుంది,” అని కూడా అపర్ణ ఆరోపించింది.
ఈ నేపథ్యంలో షైన్ టామ్ చాకో మరోసారి ఎలా స్పందిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రెండు నటీమణుల నుండి వచ్చిన ఆరోపణలు పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీశాయి.