ఒకప్పుడు స్టార్ దర్శకుడిగా ఒక వెలుగు వెలిగి వరస ఫ్లాఫ్ లతో క్రెడిబులిటీ పోగొట్టుకుని, ప్రస్తుతం తన పూర్వ వైభవాన్ని తిరిగి సంపాదించుకోవడం కోసం నానా ఇబ్బందులు పడుతున్న దర్శకుడు మురుగదాస్. ఆయన తాజా ప్రయత్నం “మదరాసి” (Madharaasi).
శివకార్తికేయన్, రుక్మిణి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం మీద రిలీజ్ కు ముందు ప్రేక్షకులకు పెద్దగా అంచనాలు లేవు అనేది ఒప్పుకోవాల్సిన నిజం. ఈ సినిమాతో హిట్ కొట్టి దర్శకుడిగా మురుగదాస్ కమ్ బ్యాక్ ఇస్తాడని కొందరు అభిమానులు నమ్మారు. కానీ సినిమాకు నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. అయితే యాక్షన్ ఎపిసోడ్స్ బజ్ తెచ్చుకున్న ఈ చిత్రం వీకెండ్ తర్వాత కలెక్షన్స్ ఉన్నాయా? లేవా? అనేది చూద్దాం..!!
ప్రపంచవ్యాప్తంగా మొదటి వీకెండ్‌లో సుమారు ₹62 కోట్లు కలెక్షన్స్ సాధించిన మధరాసి, మంగళవారం మొదటి రోజు కలెక్షన్స్‌లో 60% కి పైగా క్షీణించడాన్ని చూపించింది. నాలుగు రోజుల మొత్తంలో ఇది ₹68 కోట్లు వరకు పడిపోయింది, ఫలితంగా సినిమా భవిష్యత్ కలెక్షన్స్‌పై ఒత్తిడి పెరిగింది.
ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారేమిటంటే, సినిమా నిలకడగా ఉండి మరిన్ని డ్రాప్ రాకుండా ఉంటేనే సినిమా నిలబడుతుంది. “హిట్” స్టేటస్ సాధించాలంటే, మధరాసికి ₹150 కోట్లు గ్లోబల్ కలెక్షన్ అవసరం, దీని కోసం థియేటర్లలో స్టడీ రన్ అవసరం.