బాలకృష్ణ (Balakrishna) హీరోగా ప్రసిద్ధ సంగీత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కాంబోలో వచ్చిన ఒకప్పటి సైంటిఫిక్ ఫిక్షనల్ మూవీ ‘ఆదిత్య 369’ (Aditya 369). ఈ మూవీ మరోసారి థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11న రీ రిలీజ్ చేస్తున్నారు.

టైమ్ ట్రావెల్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీని ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా డిజిటలైజ్ చేసి ఏప్రిల్ 11న గ్రాండ్‌గా రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

గాన గంధర్వుడు ఎస్పీ బాలు సమర్పణలో శ్రీదేవీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. 1991లో విడుదలైన ఈ చిత్రాన్ని శివలెంక ప్రసాద్ నిర్మించారు.

ఇళయరాజా మ్యూజిక్, జంధ్యాల డైలాగ్స్, ఎస్పీ బాలు గాత్రం, సింగీతం దర్శక నైపుణ్యం అన్నీ కలగలిపి ఈ చిత్రం సినీ అభిమానుల గుండెల్లో ఎప్పటికీ ఐకానిక్ ఫిల్మ్‌గా నిలిచిపోతుంది.

బాలయ్య.. శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణ కుమార్‌గా… రెండు పాత్రల్లోనూ అద్భుతమైన నటన కనబరిచిన ఈ చిత్రం పెద్ద మ్యూజికల్ హిట్ కూడా. ఇందులో పాటలన్నీ ఇప్పటికీ ఫేవరేట్.

అన్నట్టు ఈ సినిమాకి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు బాలయ్య. ఆయనే కథ, కథనాలు రాసేపనిలో వున్నారు. మోక్షజ్ఞతో ఈ ప్రాజెక్ట్ వుంటుంది.

, ,
You may also like
Latest Posts from