గత రెండు నెలల్లో తెలుగు సినిమా రంగం ఒక ఆసక్తికరమైన మలుపు చూసింది. పెద్ద స్టార్ సినిమాలపై ఆధారపడకుండా, కంటెంట్‌ ఆధారిత చిత్రాలు థియేటర్లలో దుమ్మురేపుతున్నాయి. ఈ విజయానికి ప్రధాన కారణం టికెట్ ధరలు అందుబాటులో ఉండటమేనని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు.

మలయాళ చిత్రం ‘కొత్త లోక’ , యానిమేటెడ్ భక్తి చిత్రం ‘మహావీర్ నరసింహ’ ,జపాన్ యానిమే ‘డీమన్ స్లేయర్’ వరకు—ప్రేక్షకులు విభిన్నమైన కంటెంట్‌ని ఆమోదించారు. వీటి వసూళ్లు కలిపి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ₹65 కోట్లకు పైగా చేరాయి. ఇది ప్రేక్షకులు ప్రయోగాత్మకమైన సినిమాలకు కూడా పెద్ద ఎత్తున రావడానికి సిద్ధంగా ఉన్నారని నిరూపిస్తోంది.

ఇక, ‘లిటిల్ హార్ట్స్’ , ‘మిరాయ్’ లాంటి చిన్న, మధ్యస్థాయి సినిమాలు దాదాపు ₹50 కోట్ల వసూళ్లను రాబట్టడం మరో ఉదాహరణ. ఈ విజయాలు కొత్త నటులకు, దర్శకులకు కొత్త అవకాశాలు తెచ్చిపెడుతున్నాయి. యువ నటులైన మౌలి, తేజ సజ్జ, తొమ్మిదేళ్ల తర్వాత తిరిగి వచ్చిన మంచు మనోజ్ వంటి వారికి ఇది గణనీయమైన మార్గదర్శకం అయ్యింది.

పరిశ్రమ గుర్తు చేస్తున్న విషయం ఏమిటంటే—చెన్నైలో మల్టీప్లెక్స్ టికెట్ ధర ₹180 లోపు, కర్ణాటకలో ₹200 లోపే నియంత్రణలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి అందుబాటు ధరలు ఉంటేనే పెద్ద ఎత్తున ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. అధిక టికెట్ ధరల కంటే పెద్ద ఎత్తున ఫుట్‌ఫాల్స్ మీద దృష్టి పెట్టడం ద్వారా మాత్రమే థియేటర్ల భవిష్యత్తు రక్షించబడుతుందని అభిప్రాయం బలపడుతోంది.

పాతతరం సూపర్‌స్టార్లు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ కాలంలో టికెట్ ధర బాగా తక్కువగా ఉండటం వల్లనే కోట్లాదిమంది వారి సినిమాలు చూడటానికి థియేటర్లకు వచ్చేవారు. ఆ మోడల్‌ వల్లే ఆ కాలంలో 3,000కి పైగా థియేటర్లు బతికేవి. ఇప్పుడు ఆ సంఖ్య 1,500కి తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

అందుకే — స్టార్ పవర్ కంటే కంటెంట్‌, అధిక టికెట్ ధరల కంటే పెద్ద ఎత్తున ప్రేక్షకుల రాకే తెలుగు సినిమాకి భవిష్యత్తు నిర్ణయిస్తుంది అని చెప్పేది.

, , , , , ,
You may also like
Latest Posts from