శ్రీవిష్ణు పేరు వినగానే మనకు నవ్వే హీరో గుర్తుకొస్తాడు. అతను ఎంత సీరియస్‌గా ఉన్నా, ఆ హావభావాల్లో ఏదో ఒక చిన్న పాటి హాస్యం దాగి ఉంటుంది. ఇదే ఆయన కామెడీ సినిమాల వరుస సక్సెస్ కు కారణం అయ్యింది.
“మెంటల్ మదిలో”, “బ్రోచేవారుఎవరురా”, “సామజవరగమన”, ఇప్పుడు “సింగిల్”… ప్రతి సినిమాకూ కామెడీ వేరు… కాన్సెప్ట్ వేరు… కానీ కామెడీ టైమింగ్ మాత్రం శ్రీవిష్ణు సిగ్నేచర్. ఆయన చేసిన ప్రతీ కామెడీ సినిమా either cult following తెచ్చుకోలేపోయినా slow poisonలా మారిందనే చెప్పాలి. తాజాగా థియేటర్లలో రిలీజైన “సింగిల్” ఏమాత్రం కిక్కిచ్చాడు? అసలు ఈ చిత్రం కథేంటి, శ్రీ విష్ణు మరోసారి తన కామెడీ టైమింగ్‌తో మెప్పించాడా? చూద్దాం!
కథేంటి
విజయ్ (శ్రీ విష్ణు) ఓ బ్యాంకులో ఇన్సూరెన్స్ విభాగంలో పనిచేస్తున్న సాధారణ ఉద్యోగి. మంచి మనసున్నోడు, కానీ ప్రేమ విషయంలో మాత్రం చాలా సీరియస్. ఒక రోజు మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు పూర్వ (కేతికా శర్మ) అనే అమ్మాయిని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. పూర్వ ఓ ఆడి కార్ షోరూలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తుంటుంది.
ఆమెను ఇంప్రెస్ చేయాలన్న ఉద్దేశంతో విజయ్ ఓ ప్లాన్ వేస్తాడు – ఆమెతో కలిసి కార్ టెస్ట్ డ్రైవ్‌కు వెళ్లి తన మనసు చెప్పాలని అనుకుంటాడు. కానీ ఆ ప్లాన్‌లో ఓ చిన్న ‘మిస్ కమ్యూనికేషన్’ జరుగుతుంది. హరిణి (ఇవానా) అనే యువ డ్యాన్సర్ విజయ్ తనను ప్రేమిస్తున్నాడని అపోహ పడుతుంది. దీంతో హరిణి కూడా విజయ్‌ను ప్రేమించడం మొదలు పెడుతుంది. ఇక్కడినుంచి కథ మెల్లగా ఒక ముక్కోణపు ప్రేమకథగా మారుతుంది.
ఒకవైపు విజయ్ పూర్వ ప్రేమలో పడి ఆమె వెంట తిరుగుతుంటే… మరోవైపు హరిణి విజయ్ వెనకాల తిరుగుతుంటుంది. ఇదే సమయంలో కథలోకి ప్రవేశిస్తాడు మూర్తి (రాజేంద్ర ప్రసాద్) అనే ఆసక్తికరమైన వ్యక్తి. మరోవైపు విజయ్‌కు బాసుగా ఉండే అరవింద్ (వెన్నెల కిషోర్) తన కామెడీ పంచులతో కథను కదుపుతూ ముందుకు నడిపిస్తుంటాడు.
ఈ నేపథ్యంలో, విజయ్ ప్రేమ కథ చివరికి ఎలా ఓ కొలిక్కి వచ్చింది? అతనికి నిజంగా ఎవరు అవసరం? ఎవరు అతనితో ఉంటారు? అన్నది తెలుసుకోవాలంటే సినిమానే చూడాల్సిందే!
ఎనాలసిస్
“The most personal stories are the most universal ones” అనే మాట చెప్పింది గుయెర్మో డెల్ టోరో. అదే నిజమైంది ఈ సినిమాలో. ఇది ఓ సింపుల్ లవ్ స్టోరీలా అనిపించొచ్చు. కాని లోపల చూస్తే… ఇది రిలేషన్‌షిప్‌ల గురించి ఒక ఫన్ కామెంటరీ. ప్రేమ గురించి కంటే, ప్రేమలో కలిగే అపార్థాల గురించి. సింపుల్‌గా చెప్పాలంటే, ప్రేమ కథ కాదు ఇది… ప్రేమలో ఉన్న కన్‌ఫ్యూజన్ కు చెందిన కథ!
“Structure is not a formula; it’s a container for your chaos” – Robert McKee అనే పెద్దాయన అంటాడు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ పూర్తిగా జోక్స్ కలిపిన సీన్స్ తో నడుస్తుంది. ఎక్కడా కథ అనేది ఉండదు. మెట్రో స్టేషన్ చుట్టూ తిరుగుతూ, నిజమైన డ్రామాకంటే… కామెడీలోనే కిక్ ఇచ్చేలా ఉంటుంది. స్క్రీన్‌ప్లేలో పెద్ద సంఘర్షణలు కనిపించకపోయినా, “missed communication is the new villain” అన్నట్టు, అపార్థాలే కథను ముందుకు నడిపిస్తాయి.
ఇంటర్వెల్ వరకూ కథలో అసలు కన్‌ఫ్లిక్ట్ రాలేదన్న ఫీల్ వస్తుంది కానీ… “Don’t give them what they expect. Give them what they don’t know they want.” – William Goldman అనేది perfectly match అయ్యే పాయింట్ ఇది. Because second half కి ఎమోషనల్ ట్రాక్స్, మిమిక్రీ కామెడీ, మలుపుల సమ్మేళనం కథను డిఫరెంట్ చేస్తుంది.
ఈ సినిమా స్క్రిప్ట్ వ్రాసినవారు స్పష్టంగా టార్గెట్ ఆడియన్స్ = Gen Z అని డెసైడ్ అయ్యారు. మీమ్స్, రిలేటబుల్ డైలాగ్స్, జెన్ జీ లాంగ్వేజ్ మీద సెటైర్లు – ఇవన్నీ చాలా బాగా వర్క్ అయ్యాయి. ఇక ఈ సినిమా మొదట నవ్విస్తుంది. చివరికి కొంచెం మనస్సుకి తాకే ఎమోషన్‌కి కూడా చోటిచ్చింది.
ఎవరెలా చేసారు
శ్రీవిష్ణు మాస్ హీరోలను imitation చెయ్యడం అంటే… పాత సినిమాల cult సీన్స్‌ని కొత్త హావభావాలతో రీక్రియేట్ చేయడం. దీనికి వెన్నెల కిషోర్ సాయిం చేసాడు. ఆయన రియాక్షన్స్ అన్నీ థియేటర్లో LOL అనిపించేవే. డైలాగ్స్ కీలకపాత్ర వహించాయి. కేతికా శర్మ, ఇవానా ఇద్దరికీ కూడా బాగా స్కోప్ ఇచ్చిన కథ ఇది. ముఖ్యంగా హరిణి క్యారెక్టర్ ఎమోషనల్‌గా ఆకట్టుకుంటుంది. వెన్నెల కిషోర్ బాగా నవ్వించారు.
టెక్నికల్ గా చూస్తే… ఇలాంటి సినిమాలకు అవసరమైన పాటలు మాత్రమే మొహం చాటేసాయి. అలాగే మేకింగ్ లో క్వాలిటీ లేదు. బాగా చిన్న సినిమా చూస్తున్న ఫీల్ వచ్చింది. మెట్రో స్టేషన్, ఆఫీసు సెటప్, పెంట్ హౌస్ తప్ప పెద్దగా లొకేషన్లు కూడా లేవు. కేవలం రైటర్స్, శ్రీవిష్ణు కలిసి మోసిన సినిమా ఇది. ఎడిటింగ్ కూడా షార్ప్ గా ఉంది. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే… ప్లజెంట్ ఫీలింగ్ ఇచ్చింది.
ఫైనల్ గా
కామెడీ టోన్, డైలాగ్ డెలివరీ, expressions అన్నీ youth కు దగ్గరయ్యేలా ఉన్నాయి. కాబట్టి మీరు యూత్ కాకపోతే అనిపించుకోవటానికైనా ఓ లుక్కేయండి.