సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, ఘట్టమనేని రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ త్వరలోనే టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా యాక్టింగ్‌తో పాటు సినిమా తాలూకా అన్ని విభాగాల్లో శిక్షణ పొందిన జయకృష్ణ, ఇప్పుడు హీరోగా తెరంగేట్రానికి సిద్ధమయ్యారు.

ఆర్‌ఎక్స్ 100, మంగళవారం వంటి డిఫరెంట్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతిని, ఈ లాంచ్‌కు కాప్టెన్ ఆఫ్ ది షిప్‌గా ఎంపిక చేశారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ జోరుగా కొనసాగుతోంది. సెప్టెంబర్‌లో షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. హీరోయిన్‌గా ఓ తెలుగు అమ్మాయిని పరిచయం చేయాలని టీమ్ భావిస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు మొదలయ్యాయి.

ఈ భారీ ప్రాజెక్టును మూడు ప్రతిష్టాత్మక సంస్థలు — పద్మాలయ స్టూడియోస్, వైజయంతీ మూవీస్, ఆనంది ఆర్ట్స్ కలిసి నిర్మించనున్నాయి. అజయ్ భూపతి ఈ చిత్రాన్ని ఒక పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించనున్నాడు.

మ్యూజిక్ కోసం జివి ప్రకాష్ కుమార్‌ను సంప్రదించగా, సినిమాటోగ్రఫీ బాధ్యతలను ‘పడి పడి లేచె మనసు’, ‘రాణా నాయుడు’ ఫేమ్ జయకృష్ణ గుమ్మడి చేపడుతున్నారు. టెక్నికల్ టీమ్‌లో టాప్ క్రాఫ్ట్ టాలెంట్ పని చేస్తున్నట్లు సమాచారం.

ఈ సినిమాను అధికారికంగా ఆగస్టులో లాంచ్ చేసి, వెంటనే సెప్టెంబరులో షూటింగ్ ప్రారంభించనున్నారు. టైటిల్‌తో పాటు మరిన్ని కీలక వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. కొత్త తరం హీరోకు కొత్త బ్లాక్‌బస్టర్ జన్మనివ్వాలని ఫ్యాన్స్‌ ఇప్పటికే భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు!

, , , ,
You may also like
Latest Posts from