బోసినవ్వుల గాంధీ తాత  ఎప్పటికప్పుడు మనలో స్ఫూర్తినింపుతూనే ఉంటారు. ఈ  మహాత్ముడి విశేషాలు తరుచుగా మననం చేసుకుంటూనే ఉంటాం. సినిమాల్లోనూ గాంధీ తాతపై పాటలు వచ్చాయి. ఆయన జీవిత చరిత్రం సినిమాగా వచ్చింది. ఇప్పుడు  ‘గాంధీ తాత చెట్టు’టైటిల్ తో తెలుగులో ఓ సినిమా రాబోతోంది.  

సుకుమార్ కుమార్తె సుకృతి తొలిసారి కెమెరా ముందుకు వ‌చ్చిన సినిమా ‘గాంధీ తాత చెట్టు’.పుష్ప2 వంటి సూపర్ హిట్ ఇచ్చిన మైత్రీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తోంది. సుకుమార్ భార్య త‌బిత ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కురాలు. ప‌ద్మావ‌తి మ‌ల్లాది ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

హైలెట్స్

85 లక్షల బడ్జెట్ తో రూపొందింన ప్రయోగాత్మక చిత్రం. ఇదో క్రౌండ్ ఫండింగ్ చిత్రం. Cinema Stock Exchange (cinemastockexchange.com) అనే సంస్ద తో ఈ క్రౌడ్ ఫండింగ్ సాధ్యమైంది.

దాదాపు 200 మందిని ఆడిషన్స్ చేసి ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతిని ప్రధానపాత్రకు ఎంపిక చేసారు.

ఈనెల 24న విడుద‌ల అవుతోంది. ట్రైల‌ర్  మ‌హేష్‌బాబు చేతుల మీదుగా విడుద‌లైంది.

ట్రైల‌ర్ ఎలా ఉందంటే…

ట్రైలర్ మొత్రం చాలా ఎమోషన్ గా సాగింది. గాంధీ అనే పేరున్న ఓ అమ్మాయి ప్ర‌యాణం ఇది. గాంధీ అనే పేరు ఓ అమ్మాయికి పెట్ట‌డం ఏమిటి? అన్న‌ది ప్ర‌శ్న‌ తో మొదలై గాంధీ స్మరణతో సిద్దాంతంతో ఓ సామాజిక సమస్యకు పరిష్కారం చెప్పే పరిష్కారం సినిమాలో చేసారని అర్దమవుతోంది.

క్లైమాక్స్ లో గాంధీ అవ‌తారంలో సుకృతి క‌నిపించ‌డం, ర‌ఘ‌ప‌తి రాఘ‌వ రాజారాం… అంటూ భావోద్వేగంగా ప‌లికించ‌డం ఇవ‌న్నీ ఆక‌ట్టుకొన్నాయి.

,
You may also like
Latest Posts from