
యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్నాడు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ని కూడా డామినేట్ చేస్తూ, అన్ని బిగ్ ప్రాజెక్ట్‌లకు మొదటి ఆప్షన్‌గా మారిపోయాడు. పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ కోసం తమన్ చాలా కాలం నుంచి కష్టపడ్డాడు. నిన్న రాత్రి ప్రీమియర్స్‌తో సినిమా రిలీజ్ అయ్యాక, అతని వర్క్ పై వచ్చిన స్పందన మాత్రం ఒకటే మాట – సూపర్బ్!
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో తమన్ మ్యాజిక్ అసలే వేరే లెవెల్‌లో ఉందని, ముఖ్యమైన సీన్స్‌ను గట్టిగా ఎలివేట్ చేసిందని అభిమానులు చెబుతున్నారు. ప్రతి బీట్, ప్రతి సౌండ్ ఎఫెక్ట్ సినిమా మూడ్‌కి సరిగ్గా సరిపోయేలా కంపోజ్ చేయడం వల్ల మెగా ఫ్యాన్స్‌కి అసలైన మ్యూజిక్ ఫీస్ట్ లభించింది.
స్టైలిష్ యాక్షన్ డ్రామా ‘ఓజీ’కి సుజీత్ దర్శకత్వం వహించగా, పవన్ కళ్యాణ్, ప్రియాంకా మోహన్, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. DVV దానయ్య నిర్మించిన ఈ సినిమా టెక్నికల్‌గా గ్రాండ్‌గా ఉండగా, తమన్ సంగీతం మాత్రం అదనపు ‘కిల్లింగ్’ ఇంపాక్ట్ ఇచ్చిందని సోషల్ మీడియాలో రివ్యూలు జోరుగా వినిపిస్తున్నాయి.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘OG’ (ఓజస్ గంభీర). యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించిన ఓజీ ఇవాళ (సెప్టెంబర్ 25న) థియేటర్లలో విడుదలైంది. ఓజాస్ గంభీర అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో పవన్ కళ్యాణ్ నటించాడు. ఒమీ అనే విలన్ క్యారెక్టర్లో ఇమ్రాన్ హష్మీ కనిపించాడు. పవన్ భార్యగా కన్మణి పాత్రలో ప్రియాంక, సత్య దాదాగా ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
సుమారు రూ.250 కోట్లతో డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. మోస్ట్ క్రియేటెడ్ టెక్నీషియన్స్ రవి కె.చంద్రన్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫర్స్గా పనిచేశారు.
