పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ హరి హర వీరమల్లు సెట్స్‌కి అడుగుపెట్టాడు. ఆ లోపలే మరో గాసిప్ మొదలైంది. పవన్ స్నేహితుడు, ప్రముఖ దర్శకుడు, రచయిత అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మళ్లీ సెట్స్‌లో కనిపించాడట! ఈ వార్త పవన్ అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తోంది, మరికొందరిలో ఆందోళనను కూడా పెంచుతోంది. అసలేం జరుగుతోంది.

పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీగా ఉన్నప్పటికీ, సినిమా షెడ్యూల్‌కి మళ్లీ వెనక్కి వచ్చేశారు. హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. కానీ ఈసారి ఫోకస్ మొత్తం ఒక్కరిపై పడింది – అతడే త్రివిక్రమ్ శ్రీనివాస్.

ఇటీవల సెట్స్‌లో త్రివిక్రమ్ కనిపించాడన్న వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్. పవన్ కళ్యాణ్‌కి అత్యంత నమ్మకస్తుడైన త్రివిక్రమ్, గతంలో BRO, భీమ్లా నాయక్ లాంటి సినిమాల్లో క్రియేటివ్ గైడెన్స్ ఇచ్చారు. కానీ ఆ సినిమాల ఫలితాలు ఫ్యాన్స్‌ని పూర్తిగా మెప్పించలేకపోయాయి.

అయితే ఇప్పుడు త్రివిక్రమ్ హరి హర వీరమల్లు సెట్స్‌లో ఎందుకు ఉన్నాడు? ఇది స్నేహంగా వచ్చారా? లేక స్క్రిప్ట్‌లో మార్పులు జరుగుతున్నాయా? లేక “ఆయనే హ్యాండిల్ చేస్తున్నాడా?” అనే చర్చలకు దారి తీసింది. ఇది క్రియేటివ్ సపోర్ట్‌నా? లేక డెసిషన్ మేకింగ్‌లో పవన్ ఫుల్‌గా త్రివిక్రమ్‌పై డిపెండ్ అవుతున్నాడా? అనే కోణాల్లో చర్చ నడుస్తోంది.

హరి హర వీరమల్లు అనేది రొటీన్ మాస్ సినిమాలు కాదు… ఇది పవన్‌కు ఆల్రెడీ చాలావరకు డిలే అయిన ప్రెస్టీజియస్ పీరియాడిక్ డ్రామా. ఇలాంటి ప్రాజెక్టులో త్రివిక్రమ్ ఇన్‌వాల్వ్ అవుతాడంటే… అది గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా? అనేది ఫ్యాన్స్‌లో డిస్కషన్ పాయింట్ గా మారింది.

, , ,
You may also like
Latest Posts from