
స్టార్ హీరో వెంకటేశ్ ఈ ఏడాది ప్రారంభంలోనే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడాయన అదే జోష్‌తో మరో సినిమాను (Venky77) ప్రారంభించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాన్నారు. వెంకటేశ్ 77వ చిత్రంగా ఇది రానుంది. ఇటీవల గ్రాండ్‌గా లాంచ్ చేసిన ఈ మూవీకి ప్రీ-ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తయింది. రెగ్యులర్ షూట్ అక్టోబర్ 6న ప్రారంభం కానుంది.
ఈ ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లో డార్క్ క్రైమ్ యాంగిల్ కూడా ఉండబోతోందట. అలాగే త్రివిక్రమ్ (Trivikram) గత చిత్రాల్లాగే ఇందులోనూ ఇద్దరు హీరోయిన్స్ కు అవకాశమున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ పాత్రల కోసం త్రిష, నిధి అగర్వాల్‌తో పాటు రుక్మిణీ వసంత్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం బలంగా వినిపించింది. ఫైనల్ గా హీరోయిన్‌గా ఎవరు ఎంపికయ్యారో తెలుసా? మొదట త్రిషా, మీనాక్షి చౌదరి పేర్లు పరిగణనలోకి తీసుకున్నా… ఫైనల్‌గా KGF, HIT 3 ఫేమ్ శ్రీనిధి శెట్టి సీన్ లోకి వచ్చారు.
గతంలో మహేష్ బాబు ‘గుంటూరు కారం’ డైరెక్ట్ చేసిన త్రివిక్రమ్, ఆ తర్వాత అల్లు అర్జున్ కోసం సిద్ధం చేసిన ప్రాజెక్ట్ సెట్స్ మీదకే రాలేదు. వెంటనే వెంకటేష్ కోసం కొత్త స్క్రిప్ట్ రెడీ చేసి, ఫిక్స్ చేశారు.
వెంకటేశ్ (Venkatesh) ఈ మూవీ తనకెంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ఇద్దరూ రెండు సినిమాలకు వర్క్ చేశారు. వెంకటేశ్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’లకు త్రివిక్రమ్ రైటర్‌గా పనిచేశారు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే వెంకీ నటిస్తుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. వచ్చే ఏడాది వేసవికి దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
ఇక దీనితో పాటు వెంకటేశ్ వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో రానున్న చిత్రంలో (Mega 157) అతిథి పాత్రలో కనిపించనున్నారు. అలాగే ‘దృశ్యం -3’తో మరోసారి థ్రిల్ పంచనున్నారు. ఇండస్ట్రీలోని ఓ స్టార్ హీరోతోనూ నటించనున్నట్లు ఇటీవల తెలిపారు.
త్రివిక్రమ్ తో చేస్తున్న మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ త్వరలోనే రానున్నాయి. హారిక & హాసినే క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌పైనే ఇప్పుడు టాలీవుడ్ దృష్టి అంతా!
