సినిమా నచ్చితే ప్రేక్షక దేవుళ్లు చూపించే అభిమానం పీక్స్ లో ఉంటుందనే విషయం మరో సారి రుజువైంది. మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ జీవిత కథ ‘ఛావా’ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులు ఎమోషన్ కు గురవుతోన్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. విక్కీ కౌశల్‌ నటనను అందరూ శభాష్ అంటున్నారు. ఈ నేపధ్యంలో ఓ అభిమాని గుర్రంపై సినిమాకు వచ్చి ఆశ్చర్యపరిచాడు.

తాజాగా నాగ్‌పుర్‌లో ఓ అభిమాని ఈ సినిమాను సెలబ్రేట్‌ చేసుకున్న తీరు అందరినీ ఆకర్షిస్తోంది. సినిమా పూర్తికాగానే ఏకంగా గుర్రంపై శంభాజీ వేషధారణలో స్క్రీన్‌ ముందుకువచ్చి కనిపించాడు. ఇది చూసిన వారంతా జై శంభాజీ మహారాజ్ (Sambhaji Maharaj) అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

విక్కీ కౌశల్‌, రష్మిక (Rashmika) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం విక్కీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకువచ్చిన ‘ఛావా’ ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ సినిమా పూర్తైన తర్వాత ప్రేక్షకులు థియేటర్ల నుంచి కన్నీళ్లతో బయటకు వస్తున్నారు. మరికొంతమంది సినిమా పూర్తైన వెంటనే శంభాజీ మహరాజ్‌ను గుర్తు చేసుకుంటూ నినాదాలు చేస్తున్నారు.

, , , ,
You may also like
Latest Posts from