విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్డమ్’ (Kingdom Movie) జులై 31న థియేటర్లలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రానికి సీతార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు విడుదల తేదీని అధికారికంగా ప్రకటించాయి.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా, సత్యదేవ్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
ఇక టాలీవుడ్‌లో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ బిజినెస్ వేగంగా సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం, తెలుగు వెర్షన్ బ్రేక్‌ఈవెన్ టార్గెట్ – 50 కోట్ల షేర్ గా ఫిక్స్ అయ్యింది.
టెరిటరీ వారీగా బిజినెస్:
నిజాం హక్కులు: సుమారు ₹15 కోట్లు
ఆంధ్రా (6 టెరిటరీస్): ₹15-16 కోట్లు
సీడెడ్: ₹5.5 కోట్లు
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం బిజినెస్: ₹35 కోట్లు
దీనికి ROI (రెస్ట్ ఆఫ్ ఇండియా) నుంచి ₹5 కోట్లు, ఓవర్సీస్ హక్కులు ₹10 కోట్లు విలువ చేయగా, మొత్తం కలిపి తెలుగు వెర్షన్ బిజినెస్ రూ.50 కోట్లు దాటింది.
దీనర్థం ఏమిటంటే:
ఈ చిత్రానికి తెలుగు వెర్షన్ బ్రేక్‌ఈవెన్ టార్గెట్ – ₹50 కోట్లు షేర్ కావాల్సి ఉంటుంది. అంటే థియేటర్లలో ఈ మొత్తం షేర్ వస్తేనే డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు వస్తాయి.
సినిమా క్రేజ్ ఎలా ఉంది?
ప్రస్తుతం సినిమా మీద హైప్ సాధారణ స్థాయిలో ఉన్నా, విజయ్ దేవరకొండ క్రేజ్ మాత్రం ప్రేక్షకుల్లో బాగానే ఉంది. ఒక పవర్‌ఫుల్ ట్రైలర్ వస్తే ఈ మూవీపై బజ్ ఒక్కసారిగా పెరగనుంది.
పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ‘కింగ్డమ్’లో విజయ్ దేవరకొండ గూఢచారిగా కనిపించనున్నారు. ఇక ‘‘కింగ్డమ్’ రెండు భాగాలుగా (vijay deverakonda kingdom two parts) రానుంది. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ స్వయంగా ప్రకటించారు.
‘కథలో లాజిక్స్, స్క్రీన్‌ప్లే, యాక్షన్, గ్రాండియర్ లుక్.. ఇలా చాలామంది పలు అంశాలు కోరుకుంటారు. ఈ సినిమాలో అవన్నీ ఉంటాయి. విమర్శకులకు సైతం దొరక్కుండా ఉండేలా సినిమాని తెరకెక్కించాం’ అని నాగవంశీ పేర్కొన్నారు.