
ఫస్ట్ టైమ్ : ఈవెంట్‌లో విజయ్–రష్మిక లైవ్ ఎంట్రీ, ఫ్యాన్స్ ఫుల్ క్రేజ్!
రష్మిక మందన్నా ఎమోషనల్ కంటెంట్‌తో తెరకెక్కిన “ది గర్ల్‌ఫ్రెండ్” సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదట మెల్లగా స్టార్ట్ అయినా, మౌత్ టాక్‌తో సినిమాకి ఊపందింది. హైదరాబాద్, బెంగళూరు సహా అన్ని ఏరియాల్లో డీసెంట్ కలెక్షన్స్ నమోదవుతున్నాయి.
సినిమా హిట్ కావడంతో టీమ్ భారీ సక్సెస్ సెలబ్రేషన్ ప్లాన్ చేసింది. ఈ రోజు హైదరాబాద్‌లో జరగనున్న ఈ వేడుకకు రష్మికతో పాటు విజయ్ దేవరకొండ కూడా హాజరుకానున్నారు. రష్మిక ఈరోజు హైదరాబాద్‌కి తిరిగొచ్చి, ఈ సాయంత్రం ప్రేక్షకులతో కలిసి సినిమా చూస్తున్నారు.
ఇక ఈవెంట్‌కి అసలు స్పెషల్ ఏమిటంటే — ఇది విజయ్–రష్మిక జంటగా ఎంగేజ్‌మెంట్ తర్వాత పబ్లిక్‌గా హాజరయ్యే తొలి ఈవెంట్!
ఇద్దరూ అధికారికంగా ఎంగేజ్‌మెంట్ విషయాన్ని ప్రకటించకపోయినా, ఇండస్ట్రీలో మాత్రం ఈ కపుల్ గురించి చర్చలు గుప్పుమంటున్నాయి. మరి రేపటి సక్సెస్ సెలబ్రేషన్‌లో ఈ ఇద్దరూ జంటగా కనిపిస్తారా? పెళ్లి ఫిబ్రవరిలోనే జరిగిపోతుందా? అన్నది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్!
“ది గర్ల్‌ఫ్రెండ్” చిత్రంలో రష్మికతో పాటు దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించగా, గీతా ఆర్ట్స్ మరియు ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించారు.
రేపటి సక్సెస్ బాష్‌లో రష్మిక–విజయ్ జంటగా ఎంట్రీ ఇస్తే… సోషల్ మీడియా దద్దరిల్లడం ఖాయం!
