పాతబస్తీలో బ్యూటీ పార్లర్ నడుపుకునే సోను మోడల్(విశ్వక్ సేన్)కి అమ్మాయిలకు మేకప్ చేయటంలో మంచి ప్రావీణ్యం ఉంది. దాంతో అతనికి, అతని బ్యూటీ పార్లర్ కు వీర డిమాండ్. దానికి తోడు సోనూ మోడల్ మంచి చేయబోయి ఇరుక్కుపోయే రకం . అలా అతను లోకల్ దాదా రుస్తుం(అభిమన్యు సింగ్) , పోలీస్ శంకర్(బబ్లూ పృథ్వీరాజ్) శతృత్వం పెట్టుకుంటాడు. అంతేకాకుండా తన పార్లర్ కి వచ్చే ఓ మహిళ కు ఆయిల్ బిజినెస్ కి హెల్ప్ చేస్తే అది వికటిస్తుంది.
తాను ప్రమోట్ చేసే నూనె ఫుడ్ పాయిజన్ అయి ఎమ్మెల్యే సహా చాలా మంది ఆసుపత్రి పాలవుతారు. దాంతో సోను చుట్టూ వల పన్నుతారు పోలీస్ లు. ఇటు రౌడీలు, అటు పోలీస్ లు సోనూని పట్టుకోవాలని చూస్తుంటే వేరే దారి లేక వీళ్ల నుంచి తప్పించుకోవటానికి సోనూ మోడల్ లేడీ గెటప్ లోకి మారి లైలా అవతారం ఎత్తుతాడు. అప్పుడు ఏమైంది. అతని లవ్ స్టోరీ మేటర్ ఏంటి అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది
ఏదో ఒక కొత్తదనం లేనిదే ఇప్పుడు థియేటర్స్ జనం రావటం లేదు. ఈ విషయం విశ్వక్సేన్ కు బాగా తెలుసు. అందుకే లేడీ గెటప్ లో థియేటర్స్ లోకి దిగాడు. అయితే గెటప్ కు తగ్గ కథ,కథనం తెచ్చుకోవటం మర్చిపోయాడు. దాంతో సినిమా చవకబారు వ్యవహారంగా మారిపోయింది. రెండు రోజులు కూర్చుని కథ తయారు చేసి పట్టాలు ఎక్కించేసినట్లు అనిపించింది. కొందరు దర్శకులు ఎలాంటి కథ అయినా కొత్తగా చెప్పగలుగుతారు. ఆ టాలెంట్ డైరక్టర్ దగ్గర లేదు. దాంతో సినిమా అటూ,ఇటు కాకుండా తయారైంది. సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ వేయడం తప్ప.. ఈ సినిమాలో కొత్తగా చెప్పుకోడానికి ఏమీ లేదు. నవ్వు తెప్పించని కామెడీతో ఎంతసేపని కూర్చోబెట్టగలరు. దాంతో చూసిన వారికి సహనానికి పరీక్ష పెట్టేలా తయారైంది.
ప్లస్ లు -మైనస్ లు
ఈ సినిమాకి ఏకైక ప్లస్ విశ్వక్సేన్ ఎనర్జీ, అతని గెటప్ మిగలనివి అన్నీ మైనస్ లుగా మారాయి. మరీ ముఖ్యంగా డబుల్ మీనింగ్ డైలాగ్స్ మీద ఆధారపడ్డారు. సినిమా కథకు కోర్ పాయింట్ లాంటి సోనూ మోడల్.. లైలాగా మారడానికి ఓ బలమైన నేపథ్యం కానీ ,కారణం కానీ చూపించలేకపోయారు. ఫస్టాఫ్, సెకండాఫ్ అనే తేడా లేకుండా రెండు హాఫ్ లు ఒకేలా విసిగిస్తాయి. క్లైమాక్స్ లో కూడా చివరకి సినిమా లేవదు. అసలు లైలాగా విశ్వక్సేన్ మారిన తర్వాత చేయటానికే ఏమీ కనిపించలేదు. పూర్తి ప్యాసివ్ క్యారక్టర్స్. ఇలాంటి స్క్రిప్టులు బోర్ కొట్టిస్తాయి. అదే తెరపై జరిగింది.
టెక్నికల్ గా
విశ్వక్సేన్ …కమల్ హాసన్ కాదు..అన్ని జాగ్రత్తలు తీసుకుని లేడీ గెటప్ కి దిగటానికి తనకు తోచినట్లు మేకప్ తో మేనేజ్ చేసారు. లేడీ గెటప్ కోసం విశ్వక్ సేన్ పడిన కష్టం మాత్రం తెరపై కనిపించింది. అయితే స్క్రిప్టు ఆ కష్టాన్ని ఎలివేట్ చేసి క్యాష్ చేసుకోలేకపోయింది. ఈ సినిమాలో విశ్వక్ సేన్.. లైలాగా, సోనూ మోడల్‌గా రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలు బాగా చేసారు. రిలీజ్ కు ముందు వివాదం రేపిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి బలమైన క్యారెక్టర్ పడలేదు. మిగతా పాత్రలు సోసోగా ఉన్నాయి. టెక్నికల్ గానూ సోసోగా ఉంది. లియోన్ జేమ్స్ మ్యూజిక్ జస్ట్ ఓకే . రిచర్డ్ ప్రసాద్ కెమెరా వర్క్ ఈ చిన్న సినిమాకు రిచ్ లుక్ తెచ్చిపెట్టింది.