సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా లైలా (Laila) సినిమాతో విశ్వక్ సేన్ కొత్తగా లేడీ గెటప్‌లో కనిపిస్తుండటమే సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. ఫిబ్రవరి 14న గ్రాండ్ రిలీజ్ అయిన ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, ‘అటక్ మటక్’ లిరికల్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. విశ్వక్ సేన్ లేడీ గెటప్, మాస్ డ్యాన్స్ స్టెప్పులు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచి ప్రీ రిలీజ్ బాగా జరగటానికి అవకాసం ఇచ్చాయి.
ట్రడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, లైలా సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.8.20 కోట్ల రేంజ్‌లో ప్రీ-రిలీజ్ బిజినెస్ సాధించింది.
ఇది విశ్వక్ కెరీర్‌లో నాలుగో హయ్యెస్ట్ బిజినెస్. విశ్వక్ సేన్ క్రమంగా తన మార్కెట్‌ను పెంచుకుంటున్నట్లు ఈ ఫిగర్స్ చెబుతున్నాయి.
విశ్వక్ సేన్ (Vishwak Sen) మొదటిసారి లేడీ గెటప్ లో నటించిన చిత్రం “లైలా” (Laila).
“బట్టల రామస్వామి బయోపిక్కు” (Battalaramaswamy biopic) సినిమాతో దర్శకుడిగా మారిన సంగీత దర్శకుడు రామ్ నారాయణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
“భగవంత్ కేసరి”తో (Bhagavath Kesari) సూపర్ హిట్ కొట్టిన సాహు గారపాటి (Sahu Garapati) ఈ చిత్రాన్ని నిర్మించారు.