ఓటీటీ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్‌స్టార్, ఆహా, జీ5 వంటి ప్రైవేట్ ప్లాట్‌ఫార్ములు. కానీ ఇప్పుడు ఈ రంగంలోకి భారత ప్రభుత్వం బిగ్ ఎంట్రీ ఇచ్చింది. అదే WAVES – India’s official, all-in-one OTT platform!
వేవ్స్ అంటే ఏమిటి?
WAVES (Watch, Access, Variety, Entertainment, Stream) అనే ఈ ఓటీటీని ప్రసార భారతి (దూరదర్శన్) ఆధ్వర్యంలో 2024 నవంబర్‌లో ప్రారంభించారు. దీని లక్ష్యం – కుటుంబంతో కలిసి చూడదగిన, నైతిక విలువలతో కూడిన కంటెంట్‌ను అందించడమే.
12 భాషల్లో వినోదం – ప్రతి ఇంటికీ అందుబాటులో!
హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బంగ్లా, ఒడియా, పంజాబీ, అస్సామీ వంటి 12 భారతీయ భాషల్లో కంటెంట్ అందుబాటులో ఉంది. ఇంగ్లిష్‌లోనూ ఓ ప్రత్యేక సెక్షన్ ఉంది.
వేవ్స్‌లో ఏమున్నాయంటే…
పాత & కొత్త సినిమాలు
డీడీ క్లాసిక్స్ వంటి టీవీ షోలు
రేడియో ప్రోగ్రామ్స్
ఇంటరాక్టివ్ గేమ్స్
ఇది పూర్తిగా ఫ్యామిలీ ఫ్రెండ్లీ ప్లాట్‌ఫారమ్. చిన్నాపెద్దలందరికీ తగిన కంటెంట్‌నే అందిస్తోంది.
ధరలు!
ఇతర ఓటీటీలు నెలకు ₹199-₹299 వసూలు చేస్తుంటే, వేవ్స్ ప్లాన్స్ ఇలా ఉన్నాయి:
నెలవారీ ప్లాన్ – ₹30 (2 డివైజ్‌లలో మాత్రమే స్ట్రీమింగ్)
క్వార్టర్లీ ప్లాన్ – ₹85 (2 డివైజ్‌ల యాక్సెస్)
ఇయర్లీ డైమండ్ ప్లాన్ – ₹350 (2 డివైజ్‌లకు పరిమితం)
ఇయర్లీ ప్లాటినమ్ ప్లాన్ – ₹999 (4 డివైజ్‌ల యాక్సెస్)
ఫ్రీ కంటెంట్ కూడా ఉంటుంది… కానీ డౌన్‌లోడ్ ఆప్షన్ ఉండదు, కేవలం స్ట్రీమింగ్‌కి మాత్రమే.
ఎలా సబ్‌స్క్రైబ్ కావాలి?
సింపుల్! మీ ఫోన్ నంబర్ లేదా ఇమెయిల్‌తో వేవ్స్ యాప్‌కి లాగిన్ అయి, ప్లాన్ ఎంచుకుంటే చాలు. ప్లే స్టోర్, యాప్ స్టోర్‌లో కూడా WAVES యాప్ అందుబాటులో ఉంది.